అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా తన భార్య మిచెల్ ఒబామాతో కలిసి మరోసారి వైట్‌హౌస్‌లో అడుగుపెట్టారు.వీరు తమ అధికారిక చిత్రాల (పోర్ట్రెయిట్) ఆవిష్కరణల కోసం బుధవారం శ్వేతసౌధానికి చేరుకున్నారు.
ఒబామా అధ్యక్షుడిగా పదవీ విరమణ చేసిన తర్వాత దాదాపు ఐదేళ్లకు వైట్‌హౌస్‌లో పాదం మోపారు.ఈ సందర్భంగా ఒబామాకు వైఎస్ ప్రెసిడెంట్‌గా, ప్రస్తుతం అధ్యక్షుడిగా వున్న జో బైడెన్ వారికి ఆతిథ్యం ఇవ్వనున్నారు.
మాజీ అధ్యక్షుడు .ప్రస్తుత అధ్యక్షుడి హయాంలో తమ పోర్ట్రెయిట్‌ల ఆవిష్కరణ కోసం వైట్‌హౌస్‌కు రావడం ఆనవాయితీగా వస్తోంది.ఇది రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా నిర్వహించే వేడుక.అయితే డొనాల్డ్ ట్రంప్ అధికారంలో వుండగా.ఒబామా దంపతులు ఈ కార్యక్రమానికి రాలేదు.ట్రంప్ కూడా ఒబామాలకు ఆతిథ్యం ఇవ్వడానికి నిరాకరించారు.వారి మధ్య విభేదాలు వున్నప్పటికీ.2016లో అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్, ఒబామా దంపతులను హెలికాఫ్టర్ వరకు వచ్చి ఘనంగా వీడ్కోలు పలికారు.

కాగా.బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా వున్న సమయంలో 2012లో మాజీ అధ్యక్షుడు జార్జ్ బుష్, ఆయన భార్య లారాల పోర్ట్రెయిట్ ఆవిష్కరణలకు అవకాశం కల్పించారు.అప్పటి నుంచి నేటి వరకు శ్వేతసౌథంలో ఇలాంటి వేడుక జరగలేదు.అయితే జో బైడెన్‌తో ఒబామా దంపతులకు తొలి నుంచి సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.ఈపాటికే పోర్ట్రెయిట్ ఆవిష్కరణ కార్యక్రమం జరగాల్సి వున్నప్పటికీ.కోవిడ్ 19 కారణంగా రెండేళ్ల పాటు ఈ వేడుక వాయిదా పడుతూ వచ్చింది.
ఎట్టకేలకు ఈ కార్యక్రమం జరగడంతో వైట్‌హౌస్‌లో సందడి నెలకొంది.







