తెలుగు సినీ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు కిరణ్ అబ్బవరం( Kiran Abbavaram ) ఒకరు.ఈయన ఎన్నో తెలుగు సినిమాలలో నటించి హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.
రాజావారు రాణి గారు సినిమా ద్వారా తెలుగు చిత్ర పరిశ్రమకు హీరోగా ఎంట్రీ అయినటువంటి ఈయన అనంతరం ఎస్ఆర్ కళ్యాణ మండపం, నేను మీకు బాగా కావాల్సిన వాడిని, వినరో భాగ్యము విష్ణు కథ( Vinaro Bhagyamu Vishnu Katha ) మీటర్ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఇలా సినిమాల పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి కిరణ్ అబ్బవరం తాజాగా నూతన గృహప్రవేశం ( New House Warming ) చేశారని తెలుస్తుంది.ఇందుకు సంబంధించిన ఈ వీడియోని కిరణ్ అప్పవరం సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ వీడియో కాస్త వైరల్ గా మారింది.సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరికి ఉండే కల అది సాధారణ ప్రజలు అయినా సెలబ్రిటీలైన ఇలా జీవితంలో సొంత ఇంటి కల నెరవేర్చడం కోసం వివిధ రకాలుగా కష్టపడుతూ తమకలను నెరవేర్చుకుంటారు.
అయితే తాజాగా కిరణ్ అబ్బవరం సైతం సొంత ఇంటికలను నెరవేర్చుకున్నారని తెలుస్తోంది.
ఇక ఈయన హైదరాబాద్లో కాకుండా తన సొంత గ్రామంలో తన సొంత ఇంటి కల నెరవేర్చుకున్నారు.కడప జిల్లా రాయచోటికి చెందినటువంటి కిరణ్ అబ్బవరం నూతన గృహప్రవేశానికి సంబంధించినటువంటి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇక ఈ వీడియో చూసినటువంటి ఎంతోమంది నేటిజన్స్ ఈయనకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
ఇక ఈయన సినిమాల విషయానికొస్తే త్వరలోనే ఈయన రూల్స్ రంజన్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు.