డైరెక్టర్ మహి వి రాఘవ్( Mahi V Raghav ) దర్శకత్వంలో మమ్ముట్టి ప్రధాన పాత్రలో వైయస్ రాజశేఖర్ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఇదివరకే యాత్ర( Yatra ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.ఈ సినిమా అప్పట్లో ఎలక్షన్స్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది.
అయితే ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా ప్రస్తుతం యాత్ర 2( Yatra 2 ) సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.రాజశేఖర్ రెడ్డి మరణం తర్వాత జగన్మోహన్ రెడ్డి( Jagan Mohan Reddy ) జైలుకు వెళ్లడం పాదయాత్ర చేయడం అధికారంలోకి రావడం వంటి సన్నివేశాలను ఈ సీక్వెల్స్ చిత్రంలో చూపించబోతున్నట్టు తెలుస్తోంది.

ఇక ఈ సినిమా నేడు విడుదల కాగా వైఎస్సార్సీపీ అభిమానులు కార్యకర్తలు పెద్ద ఎత్తున ఈ సినిమాని చూస్తున్నారు.ఇక ఈ సినిమా జగన్మోహన్ రెడ్డికి సంబంధించినది కావడంతో పెద్ద ఎత్తున జగన్ అభిమానులు కూడా థియేటర్లకు తరలి వెళ్తున్నారు.ఇక ఈ సినిమాలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాత్రలో జీవా( Jeeva ) నటించిన సంగతి తెలిసిందే.ఇక రాజశేఖర్ రెడ్డి పాత్రలో మలయాళ నటుడు మమ్ముట్టి( Mammootty ) నటించారు.

తాజాగా ఈ సినిమాలో జగన్ పాత్రలో నటించడం కోసం జీవా తీసుకున్నటువంటి రెమ్యూనరేషన్( Jeeva Remuneration ) గురించి వార్తలు వైరల్ అవుతున్నాయి.ఈ సినిమా కోసం ఈయన సుమారు 8 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నట్టు సమాచారం.అదేవిధంగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించినటువంటి ముమ్ముట్టి నాలుగు కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ అందుకున్నారని తెలుస్తుంది.ఇక ఈ సీక్వెల్ సినిమా కూడా 2024 ఎన్నికల ముందు విడుదల కావడంతో ఈ సినిమా వచ్చే ఎన్నికలలో వైసిపి పార్టీకి మంచిగా కలిసి వస్తుందని పలువురు భావిస్తున్నారు.







