ముదురు మామిడి తోటల్లో( mango groves ) ప్రధాన సమస్య కాపు తగ్గిపోవడం.దాదాపుగా 30 ఏళ్లు పైబడిన మామిడి తోటల్లో కాపు నిలకడగా లేకపోవడం, కొమ్మలు విస్తారంగా వ్యాపించి దట్టంగా అలుముకోవడం వల్ల చీడపీడల బెడద( Pest infestation ) కూడా కాస్త అధికంగా ఉంటుంది.
ఈ సమస్యలను ఎలా అధిగమించి మంచి దిగుబడులు ఎలా పొందాలో తెలియక చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు.
ముదురు మామిడి చెట్లు సుమారుగా 30 ఏళ్లు దాటితే భారీగా ఎత్తు పెరుగుతాయని అందరికీ తెలిసిందే.
ఇలాంటి చెట్ల సస్యరక్షణ, కాయకోత లాంటి పనులు కాస్త కష్టంగా ఉంటాయి.మరొకవైపు చెట్ల వయసు పెరిగే కొద్దీ సహజంగా పంట కాపు తగ్గిపోతుంది.ఒకవేళ ఈ పెద్ద చెట్లను తొలగించి, మళ్లీ మామిడి మొక్కలను నాటితే పంట కాపుకు రావడానికి సుమారుగా 6 లేదా 7 సంవత్సరాల సమయం పడుతుంది.

మరి ముదురు మామిడి తోటల్లో మళ్లీ చెట్లకు పూర్వ వైభవం తేవాలంటే టాప్ వర్కింగ్ పద్ధతి చాలా ఉపయోగకరంగా ఉంటుందని వ్యవసాయ క్షేత్ర నిపుణు( Agricultural expert )ల సలహా.టాప్ వర్కింగ్ వల్ల మామిడి చెట్ల పునరుద్ధరణ చేయవచ్చు.ఈ పద్ధతి వల్ల ముదురు మామిడి తోటల్లో, తిరిగి కొమ్మలు అభివృద్ధి చెందేలా చేయవచ్చు.

వర్షపాతం అధికంగా ఉండే ప్రాంతంలో ఆగస్టు నుండి సెప్టెంబర్ మధ్య మామిడి తోటల పునరుద్ధరణ ప్రక్రియ చేపట్టాలి.ఈ ప్రక్రియలో భాగంగా కొమ్మలను 45 డిగ్రీల కోణంలో ఏటవాలుగా కత్తిరించాలి.ఇలా కత్తిరిస్తే వర్షపు నీళ్లు కొమ్మలపై నిల్వ ఉండదు.దీంతో బూజు తెగుళ్లు వచ్చే సమస్య చాలా తక్కువ.కొమ్మ కత్తిరింపులు చేసిన తర్వాత బోర్డో పేస్టు లేదంటే బ్లైటాక్స్ ద్రావణం ( Blytox solution )పూయాలి.కొమ్మ కత్తిరింపులు జరిపిన 4 నెలల్లో కొత్త చిగుళ్లు వస్తాయి.
ప్రతి కాండానికి నాలుగు లేదా ఐదు కొమ్మలు మాత్రమే ఉంచి మిగతా వాటిని తొలగించాలి.పంట పూత దశకు వచ్చే సమయంలో నీటి యాజమాన్యంలో తగిన శ్రద్ధ వహించాలి.
మొక్కకు అందాల్సిన పోషకాల లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.







