నల్లగొండ జిల్లా: 2023 నవంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నల్గొండ అసెంబ్లీ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిన మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఓటమికి కారకులైన వారిపై చర్యలు చేపట్టాలని బీజేపీ జిల్లా మీడియా కన్వీనర్ పాలకూరి రవి గౌడ్ గురువారం బీజేపీ అధిష్టానానికి బహిరంగ లేఖ రాశారు.బీజేపీ రాష్ట్ర కార్యదర్శిగా,బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా,పేదల పెన్నిధిగా మాదగాని శ్రీనివాస్ గౌడ్ బీజేపీ ఇచ్చిన బీఫామ్ నియామావాళిని ప్రకారం నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్ధిగా బరిలో నిలిచిన విషయం జగమెరిగిన సత్యం.
బీజేపీ రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఆశామాసి వ్యక్తి కాదు.నలగొండ నియోజకవర్గంలోని కాకుండా నల్గొండ జిల్లా వ్యాప్తంగా మంచి పేరున్న రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన ప్రముఖ వ్యక్తి.
గత 2020లో బీజేపీ పటిష్టంగా ఉందని భావించి నల్లగొండ నియోజకవర్గంలో బలమైన నాయకత్వం ఉందని నమ్మకంతో తెలుగుదేశం పార్టీని వీడి ఎమ్మెల్యే టికెట్ ఆశించిభారతీయ జనతా పార్టీలో పదివేల మంది తన కార్యకర్తలతో చేరిన విషయం వాస్తవం.ఆయన బీజేపీలో చేరిన నాటి నుండి అనేక రకాల వర్గాల పోరును తట్టుకొని నిలబడితే 2023 నవంబర్లో నల్లగొండ నియోజకవర్గం నుండి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో గెలుపే లక్ష్యంగా బరిలో నిలిచారు.
నియోజకవర్గంలో కారణాలు ఏమైనప్పటికీ పరిస్థితులు తనకు అనుకూలించినా, అనుకూలించకపోయినా వివిధ వర్గాల నుండి మద్దతు లభించినా, లభించకపోయినా తాను నమ్మి చేరిన పార్టీలో తనకు అన్యాయం జరిగిందని పదేపదే తన నోటివెంట తానే మాట్లాడినది వాస్తవం.
మరి మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఒక సామాన్యమైన కార్యకర్త కాదు.
ఒక మండల నాయకుడు కాదు.భారతీయ జనతా పార్టీ అత్యంత శక్తివంతమైన పదాధికారుల,రాష్ట్ర ప్రధాన అధికారుల గుర్తింపు పొందిన వ్యక్తి.
ఆయనకు అసెంబ్లీ ఎన్నికల్లో అన్యాయం జరిగితే…రాబోయే రోజుల్లో పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచే వ్యక్తికి న్యాయం జరుగుతుందా? అదేవిధంగా స్థానిక సంస్థల్లో పోటీ చేసే పార్టీ వ్యక్తులకు న్యాయం జరుగుతుందా? అనే విషయాన్ని పార్టీ ఆలోచించాలి.పార్టీని, క్యాడర్ ను,నాయకులను, కార్యకర్తలు నమ్ముకొని బరిలో దిగిన వ్యక్తికి జరిగినటువంటి అన్యాయం పైన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఎవరైతే ఉన్నారో వాళ్లు బాధ్యత వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మాదగాని శ్రీనివాస్ గౌడ్ ఓటమికి మేనేజ్మెంట్ కమిటీ బాధ్యత వహించాలి.ఎన్నికల్లో జరిగినటువంటి తప్పు ఒప్పులను మేనేజ్మెంట్ కమిటీ రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకుపోవాలి.
ఎన్నికల్లో ఇతర పార్టీ నాయకులతో లాలూచీపడి భారతీయ జనతా పార్టీకి అన్యాయం చేసినటువంటి వ్యక్తుల పైన చర్యలు తీసుకోవాలి.అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో ఉన్నటువంటి మాదగాని శ్రీనివాస్ గౌడ్ పలుమార్లు భారతీయ జనతా పార్టీ నాయకులు ఇతర పార్టీ నాయకులకు అమ్ముడుపోయారని చెప్పినప్పటికీ నల్గొండ జిల్లా నాయకత్వం,నల్గొండ జిల్లా పార్టీ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ ఎందుకు శ్రద్ధ పెట్టలేక పోతుంది?భారతీయ జనతా పార్టీలో బడుగు బలహీన వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని నమ్మి అనేకమంది బడుగు బలహీన వర్గాల ప్రజలు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు.మరి ఇలాంటి ప్రతి నాయకుడికి,కార్యకర్తకు బీజేపీ పార్టీ నాయకత్వం సరైనటువంటి సమాధానం ఇస్తుందని ఆశిస్తున్నాను.







