జగపతి బాబు తండ్రి పెద్ద దర్శకుడని మీకు తెలుసా?

జగపతిబాబు అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో కుటుంబ కథా చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు.

అప్పట్లో జగపతి బాబు నటించిన కుటుంబ కథా చిత్రాలు ఎంతో బాగా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

అంతేకాకుండా జగపతి బాబు సినిమాలు కూడా మంచి విజయం సాధించాయి.అయితే కొంత కాలం సినీ జీవితానికి విరామం చెప్పి తిరిగి విలక్షణ నటుడిగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్న జగపతి బాబు విలన్ పాత్రలో కూడా తనదైన శైలిలో నటిస్తూ ఎంతో మంది ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.

ఇంత ప్రేక్షకాదరణ పొందిన జగపతిబాబు తండ్రి కూడా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించిన వ్యక్తి.అసలు జగపతిబాబు తండ్రి ఓ దర్శకుడు అనే విషయం మీకు తెలుసా? జగపతి బాబు తండ్రి ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించారు.వాటిలో గోల్డెన్ జూబ్లీ పురస్కరించుకొన్న సినిమా గురించి జగపతి బాబు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.

జగపతి బాబు తండ్రి దర్శకత్వం వహించిన దసరా బుల్లోడు చిత్రం విడుదలయి దాదాపు 50 సంవత్సరాలు కావస్తోంది.అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ నటించిన ఎవర్‌గ్రీన్ క్లాసిక్ మూవీ దసరా బుల్లోడు చిత్రాన్ని జగపతి బాబు తండ్రి వీ బీ రాజేంద్ర ప్రసాద్ దర్శకుడిగా తన తొలి చిత్రాన్ని తెరకెక్కించారు.

Advertisement

దర్శకుడిగా తొలి చిత్రం గోల్డెన్ జూబ్లీ జరుపుకోవడం గొప్ప విశేషం అంటూ ఈ సందర్భంగా జగపతి బాబు తెలిపారు.

ఆరోజుల్లో దసరాబుల్లోడు అంటే ట్రెండ్ సెట్టర్.50 ఏళ్లైనా ఈ సినిమాను గుర్తు పెట్టుకున్నారు అంటే ఏ స్థాయిలో ఈ సినిమాను జనాలు ఆదరించారో అర్థమవుతుంది.ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నప్పుడు అందరూ కూడా తన తండ్రిని దసరా బుల్లోడు అని పిలిచేవారు.

ఎప్పుడైనా తన తండ్రి తో పాటు షూటింగ్ కి వెళితే మమ్మల్ని చూసి దసరా బుల్లోడు పిల్లలు వచ్చారంటూ మాట్లాడుకునే వారని జగపతిబాబు తెలిపారు.అప్పట్లో దసరా బుల్లోడు కారు కూడా ఎంతో ఫేమస్ అయింది.

ఆ కారును నేను కూడా నడిపానని జగపతిబాబు గుర్తు చేసుకున్నారు.దసరా బుల్లోడు సినిమా దర్శకత్వం వహించడానికి దర్శకులు ఎవరూ ముందుకు రాకపోవడంతో ఈ సినిమాని దర్శకత్వం వహించాలని నాగేశ్వరరావు స్వయంగా నాన్నకు చెప్పడంతో నాన్న ఎంతో ధైర్యం చేసి ఈ సినిమాను తెరకెక్కించాడు.

ఘనంగా పీవీ సింధు వివాహ రిసెప్షన్... సందడి చేసిన సినీ తారలు!
ఏంటి భయ్యా ఇది నిజమేనా? సానియా మీర్జా, షమీ పెళ్లిచేసుకున్నారా?

ఒకవేళ నాగేశ్వరరావు అంకుల్ ఈ సినిమా తీసే అవకాశం నాన్నకు ఇవ్వకపోయి ఉంటే ఇంత మంచి సినిమా తీసే అవకాశం నాన్నకు వచ్చేది కాదని జగపతి బాబు తెలియజేశారు.

Advertisement

తాజా వార్తలు