Varun dhawan krithi sanon : ప్రభాస్ కృతి సనన్ ఎఫైర్ నిజమే.. షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో?

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు.

అయితే ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పదుల వయసులో ఉన్నప్పటికీ ఇంకా పెళ్లి చేసుకోకపోవడంతో ఈయన పెళ్లి గురించి తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

ఇప్పటికే ప్రభాస్ పలువురు హీరోయిన్లతో అఫైర్ అంటూ పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.ముఖ్యంగా అనుష్క ప్రభాస్ ఇద్దరు కూడా రిలేషన్ లో ఉన్నారని పెళ్లి చేసుకోబోతున్నారట అనే వార్తలు రావడంతో ఈ వార్తలను అనుష్క పూర్తిగా ఖండించారు.

ఇకపోతే ప్రభాస్ ప్రస్తుతం బాలీవుడ్ నటి కృతి సనన్ ప్రేమలో ఉన్నారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి.ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కృతి ప్రభాస్ ను పెళ్లి చేసుకుంటాను అంటూ చేసినటువంటి కామెంట్స్ ఈ అనుమానాలకు మరింత ఆజ్యం పోసాయి.

ఇకపోతే కృతి సనన్ ప్రభాస్ ఇద్దరూ ప్రేమలో ఉన్నారంటూ బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట చెక్కర్లు కొడుతున్నాయి.

Advertisement

వరుణ్ ధావన్ కృతి సనన్ జంటగా బేడియాఅనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఈ సినిమా ఈ నెల 25వ తేదీ విడుదలైంది.అయితే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక బాలీవుడ్ షోలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమానికి కరణ్ జోహార్ వ్యాఖ్యతగా వ్యవహరిస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈయన వరుణ్ ధావన్ ను ప్రశ్నిస్తూ.కృతి సనన్ పేరు మీ గుండెల్లో ఎందుకు లేదు అంటూ ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు వరుణ్ ధావన్ సమాధానం చెబుతూ తన గుండెల్లో మరొకరు ఉన్నారని ఆయన ముంబైలో లేరని ప్రస్తుతం ఈయన దీపికా పదుకొనేతో కలిసి వేరే చోట షూటింగ్లో పాల్గొన్నారు అంటూ సమాధానం చెప్పారు.చెప్పారు ఇలా వరుణ్ ధావన్ చెబుతున్నప్పటికీ కృతి సనన్ నవ్వుతూనే వద్దంటూ సైగలు చేశారు.

ఇక వరుణ్ ధావన్ చేసిన కామెంట్స్ కనుక చూస్తే ప్రభాస్ ప్రస్తుతం దీపికా పదుకొనేతో కలిసి ముంబైలో కాకుండా హైదరాబాద్లో ప్రాజెక్టు కే షూటింగ్లో పాల్గొన్నారు.దీంతో వీరిద్దరూ నిజంగానే రిలేషన్ లో ఉన్నారా అంటూ చర్చలు జరుగుతున్నాయి.

నార్త్ ఈస్ట్ ఇండియన్‌ని దారుణంగా గేలి చేసిన పిల్లలు.. కలకలం రేపుతోన్న వైరల్ వీడియో..
కెనడా ప్రధాని రేసులో భారత సంతతి మహిళ .. ఎవరీ అనితా ఆనంద్?

మరి ఈ వార్తలలోకి ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు