స్టార్ హీరో కొడుకుతో హీరో అర్జున్ కూతురు పెళ్లి ఫిక్స్..ఎవరో మీరే చూడండి!

తెలుగు , తమిళం , కన్నడ మరియు మలయాళం భాషల్లో హీరో గా నటించి సూపర్ హిట్స్ ని అందుకొని కోట్లాది మంది ప్రేక్షకులకు అభిమాన నటుడిగా నిల్చిన అర్జున్ సర్జా( Arjun Sarja ) ఇప్పుడు క్యారక్టర్ ఆర్టిస్టుగా కూడా అదే రేంజ్ లో రాణిస్తూ నేటి తరం ఆడియన్స్ ని కూడా మెప్పిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.రీసెంట్ గా ఆయన లియో చిత్రం లో నెగటివ్ రోల్ ద్వారా మన ముందుకి వచ్చాడు.

 Hero Arjuns Daughter S Marriage Fix With Star Hero S Son Details , Arjun Sarja-TeluguStop.com

ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడమే కాకుండా, అర్జున్ కి కూడా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టింది.ఇకపోతే అర్జున్ కి ఇద్దరు అందమైన కూతుర్లు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.

అందులో పెద్ద కూతురు ఐశ్వర్య( Aishwarya ) ఇండస్ట్రీ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టింది.అయితే ఇప్పటి వరకు ఈమెకి సరైన సక్సెస్ లు మాత్రం రాలేదు.

అందం తో పాటు యాక్టింగ్ పరంగా కూడా ఈమె మంచి మార్కులు ఆడియన్స్ నుండి దక్కించుకుంది.

Telugu Aishwarya, Arjun Sarja, Kollywood, Leo, Pawan Kalyan, Thambi Ramaiah, Tol

కానీ సక్సెస్ లు మాత్రం రావడం లేదు.అందుకే అర్జున్ ఆయన కూతురు బాధ్యతలను స్వయానా భుజాన వేసుకున్నాడు.ఆయన దర్శకత్వం లో తమిళం లో ఈమెని హీరోయిన్ గా పెట్టి ఒక సినిమా చేసాడు.

అది కమర్షియల్ గా పెద్దగా సక్సెస్ సాధించలేదు.ఆ తర్వాత విశ్వక్ సేన్ ని హీరో గా పెట్టి, ఐశ్వర్య ని హీరోయిన్ గా తెలుగు గ్రాండ్ గా లాంచ్ చేద్దాం అనుకున్నాడు.

ఈ సినిమా ఓపెనింగ్ కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ( Pawan Kalyan )ముఖ్య అతిథి గా విచ్చేసి క్లాప్ కొట్టాడు.కానీ ఈ సినిమా అర్థాంతరంగా మధ్యలోనే ఆగిపోయింది.

ఇలా కెరీర్ పరంగా అర్జున్ ఐశ్వర్య ని కాపాడలేకపోతున్నాడు.దీంతో ఆయన తన కూతురికి పెళ్లి చేసి సెటిల్ చెయ్యాలని చూస్తున్నాడు.

గత కొంతకాలం గా ఈమె తమిళ హీరో ఉమాపతి ( Umapathy )తో ప్రేమలో ఉన్నట్టు తెలుస్తుంది.

Telugu Aishwarya, Arjun Sarja, Kollywood, Leo, Pawan Kalyan, Thambi Ramaiah, Tol

ఉమాపతి ప్రముఖ కోలీవుడ్ లెజెండ్ తంబీ రామయ్య( Thambi Ramaiah ) కి మనవుడు అవుతాడు.గత రెండేళ్ల నుండి వీళ్లిద్దరు ప్రేమించుకుంటున్నారట.కుర్రాడు మంచి వాడు, కుటుంబం కూడా ఎంతో ఉన్నతమైనది కావడం తో అర్జున్ వీళ్లిద్దరి పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.

అటుపక్క ఉమాపతి కుటుంబ సభ్యులు కూడా ఓకే చెప్పారు.వీళ్ళ పెళ్లి ఏడాది క్రితమే జరగాల్సి ఉంది.కానీ ఐశ్వర్యనే కెరీర్ లో కాస్త స్థిరపడిన తర్వాత పెళ్లి చేసుకుంటాను అని చెప్పిందట.కానీ ఇప్పటి వరకు ఆమె సక్సెస్ సాధించలేదు.

దీంతో పెళ్ళైన తర్వాత సినిమాల్లో ట్రై చేసుకోవచ్చని అర్జున్ చెప్పడం తో, ఓకే చెప్పి వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఐశ్వర్య.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube