అక్రమ్ సురేష్ హీరోగా నటిస్తున్న చిత్రం `అక్రమ్. రాజధాని అమరావతి మూవీస్ పతాకంపై ఎం.
వి.ఆర్.అండ్ విసకోటి మార్కండేయులు నిర్మిస్తున్నారు.షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ చిత్రం టీజర్ బుధవా రంనాడు హైదరాబాద్‌లోని ప్రసాద్‌ల్యాబ్ ప్రివ్యూ థియేటర్‌లో విడుదలైంది.టీజర్ అందరినీ ఆకట్టుకుంది.కొత్తవారైనా అక్రమ్ సురేష్ నటన హైలైట్‌గా నిలిచింది.
ఇదే వేదికపై ఓ పాటను చిత్ర సంగీత దర్శకుడు సాయిదీప్, కెమెరామెన్ అనిల్‌కుమార్ లాంఛ్ చేశారు.అనంతరం వారు మాట్లాడుతూ, సినిమాపై ప్యాషన్‌తోనే వచ్చాం.
మంచి సినిమా తీశామని భావిస్తున్నామని అన్నారు.
కథానాయకుడు అక్రమ్ సురేష్ మాట్లాడుతూ, ఇందులో డైలాగ్స్‌లు కూడా రాశాను అంటూ.
భారీ డైలాగ్‌ను వినిపించారు.కథ కూడా నేనే రాశాను.
రావణునికి మించిన అహం రానాలో వుంటుంది.రానా, అక్రమ్ అనేవారు ఎవరు? అనేది సినిమాలో చూస్తే అర్థమవుతుంది.త్వరలో ట్రైలర్ విడుదల చేస్తాం.అందులో మరిన్ని వివరాలు తెలియజేస్తాం.ఇందులో గీత రచయిత సురేష్ బెన్ శెట్టి పాటలు బాగా రాశారు.కథలో అన్ని కోణాలున్నాయి.
యాక్షన్, సోషియో ఫాంటసీ అనొచ్చు.చూసేవారికి థ్రిల్ కలగజేస్తుంది.
యాక్షన్ సీన్ కోసం జాగ్వార్ కార్లు లొకేషన్‌లో వాడాం.
తెలుగు సినిమాలో భారీ సినిమా రాజమౌళి వంటి వారు నిర్మించినా కొత్త వారు అనేసరికి చిన్న చూపు వుంటుంది.
ఆ చూపు వుండకూడదనే నేను ఈ రంగంలోకి వచ్చాను.చిన్న సినిమాలో కంటెంట్ వుంటుంది.నన్ను టాలీవుడ్ తలైవ అని అంటారు.ఆ పేరు నేను పెట్టుకుంది కాదు.
కీ.శే.తుర్లపాటి కుటుంబరావు గారు పెట్టారు.ఫస్ట్ లుక్ చూశాక ఆయన పెట్టిన పేరది.
పైన ఎక్కడున్నా ఆయన ఆశీస్సులుంటాయని భావిస్తున్నాను.నేను ఎ.ఎన్.ఆర్.
అభిమానిని.త్వరలో ప్రీరిలీజ్ వేడుక చేయబోతున్నాం.
దానికి అక్కినేని నాగార్జునగారు హాజరుకానున్నారని తెలిపారు.ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత- శివ శంకర్
.