హీరో అజిత్ ఇలాగే చేస్తే కెరీర్ క్లోజ్ అవ్వడం ఖాయం ..!

హీరో అజిత్.ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి స్టార్ హీరో గా ఎదిగాడు.

 Hero Ajith Movies Back To Back Flops Tegimpu Valimai Details, Ajith, Hero Ajith,-TeluguStop.com

చూడ చక్కని పర్సనాలిటీ, ఆకట్టుకునే రూపం, మంచి అందగాడు మరి ముఖ్యంగా అతడి మీసాలు, హెయిర్ స్టైల్ కి చాల మంది ఫాలోయర్స్ ఉన్నారు.ఒక్క మాటలో చెప్పాలంటే మంచి హ్యాండ్సమ్.

అయితే తమిళనాట ఒక తిరుగులేని స్టార్ హీరో గా ఎదిగిన అజిత్ ఎందుకో తప్పటడుగులు వేస్తూ ఉన్నారు, సినిమాల కథలను ఎంచుకోవడంలో రాంగ్ స్టెప్స్ వేయడం తో పాటు అన్ని ఒకే రకమైన మూస కథలని ఎంచుకుంటున్నాడు అనే భావన వస్తుంది.మొన్నటికి మొన్న సంక్రాంతికి తునివు అనే సినిమా వచ్చింది.

ఇదే సినిమాను తెగింపు అనే పేరుతో డబ్ చేసి వదిలారు.

Telugu Ajith, Ajith Flop, Kollywood, Thegimpu, Thunivu, Valimai, Viswasam, Vivek

ఈ సినిమా చుసిన తర్వాత గతంలో అజిత్ తీసిన వాలిమై చిత్రం చూసినట్టే అనిపించింది కానీ కొత్త సినిమా చూసాము అనే ఫీలింగ్ ఎక్కడ రాలేదు.సరిగ్గా వాడుకుంటే మరొక వాలి లాంటి కథ అజిత్ కి దొరకకుండా పోతుందా అనే సందేహం అయన అభిమానుల్లో కనిపిస్తుంది.ఈ మధ్య కాలం లో అయన చేసిన ఏ సినిమా కూడా గుర్తు పెట్టుకోదగ్గ విధంగా లేవు.

గ్యాంబ్లర్, వివేకం, విశ్వాసం వంటి సినిమాలు అస్సలు జనాలు ఎప్పుడో మర్చిపోయారు.సంక్రాంతి కి విజయ్ వారసుడు సినిమాతో పోటీ పడ్డ అజిత్ తెగింపు ఖచ్చితంగా తేలిపోయింది అని చెప్పవచ్చు.

Telugu Ajith, Ajith Flop, Kollywood, Thegimpu, Thunivu, Valimai, Viswasam, Vivek

ఇక ఎక్కడో ఒక మూల తెగింపు సినిమా చూసాక మహేష్ బాబు గతం లో చేసిన సర్కారు వారి పాట సినిమాలో వేసిన ఒక బ్యాంక్ సెట్టింగ్ లాంటిది ఒకటి వేసి సినిమా మొత్తం నడిపించారు అనిపించింది.ఇక ఈ సినిమాలో అజిత్ కన్నా కూడా సముద్రఖని పాత్రా తో చాల మంది కనెక్ట్ అవుతారు.అయన గతంలో ప్రియురాలు పిలిచింది వంటి సినిమాలో ప్రాధాన్యత లేని పాత్రా వేసిన జనాలు ఎంతగానో ఇష్టపడ్డారు కానీ రోజులు మారిపోతున్నాయి.వైవిద్యం లేకుండా చూపిస్తే జనాలు తిప్పి కొట్టేస్తున్నారు.

ఆ మూస లోంచి బయటకు వచ్చి మంచి కథ అజిత్ సినిమా తీయాలని తమిళ్ తో పాటు తెలుగు ప్రేక్షకులు కూడా కోరుకుంటున్నారు.లేదంటే కొన్ని రోజుల్లో ఆయన్ను హీరో గా జనాలు మర్చిపోయే అవకాశం లేకపోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube