సంక్రాంతి సీజన్ కోసం టాలీవుడ్ మొత్తం సిద్ధం అవుతుంది.అయితే ఈసారి సంక్రాంతి పోటీ రసవత్తరంగా సాగనుంది.
ఈసారి మొత్తంగా టాలీవుడ్ నుండే 5 సినిమాలు రిలీజ్ కానున్నాయి.దీంతో పొంగల్ రేసు మరింత రసవత్తరంగా ఉంది.
మరి ఈ సినిమాలు చూస్తుంటే ఒక్కటి కూడా తగ్గేలా కనిపించడం లేదు.ఈసారి సంక్రాంతి కానుకగా మహేష్ బాబు గుంటూరు కారం, వెంకటేష్ సైంధవ్( Saindhav Movie ), తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ బరిలోకి దిగనున్నారు.
మరి ఈ సినిమాల పోటీ వల్ల థియేటర్స్ దగ్గర క్లాషెస్ తప్పేలా లేదు.దీంతో నిర్మాతల మండలి రంగంలోకి దిగింది.
దిల్ రాజు ఈ ఐదు సినిమాల నిర్మాతలతో మాట్లాడినట్టు తెలుస్తుంది.కానీ ఎవ్వరు తగ్గేలా లేరని సమాచారం.కానీ నా సామిరంగ సినిమా( Naa Saami Ranga ) మాత్రం ఇప్పటికి రిలీజ్ డేట్ కానీ ఓటిటి సాటిలైట్ బిజినెస్ కానీ డీల్స్ కుదుర్చుకోలేదని దీంతో ఈ సినిమాను వాయిదా వేసుకోమని మిగతా డిస్టిబ్యూటర్స్ కోరుతున్నారట.
కానీ నాగ్ కూడా తగ్గేలా కనిపించడం లేదని తెలుస్తుంది.సోగ్గాడే చిన్నినాయనా( Soggade Chinni Nayana ), బంగార్రాజు వంటి సినిమాలు సంక్రాంతికి వచ్చి భారీ హిట్ అందించగా ఈసారి కూడా హిట్ అందుకోవాలని తహతహ లాడుతున్నారు.అయితే ఈసారి చివరి నిముషంలో ఏదైనా వాయిదా పడి ట్విస్ట్ ఇస్తారా లేదా అన్ని సినిమాలు రిలీజ్ అవుతాయో చూడాలి.