యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు.నాలుగేళ్ళ తర్వాత ఎన్టీఆర్ మంచి హిట్ అందుకోవడంతో ప్రేక్షకులు ఆనందంగా ఉన్నారు.
ఈ సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు నిరీక్షించారు.అయితే ఇది బ్లాక్ బస్టర్ హిట్ అయినా కూడా మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమా విజయం ఎన్టీఆర్ ది ఒక్కడిదే కాదు.
కాబట్టి ఇప్పుడు తారక్ ఫ్యాన్స్ ఎన్టీఆర్ 30వ సినిమా కోసమే ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా భారీ విజయం తర్వాత ఎన్టీఆర్ కొరటాల శివ తో సినిమా చేయనున్నాడు.
అయితే ఇప్పటి వరకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లలేదు.కానీ ఇటీవలే ఎన్టీఆర్ బర్త్ డే జరుపుకున్న క్రమంలో ‘NTR30‘ నుండి కొరటాల మోషన్ పోస్టర్ వదిలి ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేసాడు.
ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్ లైనప్ లో మరొక ఇద్దరు డైరెక్టర్లు కూడా ఉన్నారు.

కేజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో కూడా ఎన్టీఆర్ సినిమా కన్ఫర్మ్ అయ్యింది.ఇప్పటికే వీరి సినిమా అఫిషియల్ గా ప్రకటించారు.అలాగే ఉప్పెన సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు సానా తో కూడా ఎన్టీఆర్ ఒక సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పటికే కన్ఫర్మ్ అయ్యింది.
బుచ్చిబాబు సుకుమార్ శిష్యుడు కావడంతో ఎన్టీఆర్ తో ఈయనకు కూడా పరిచయం ఏర్పడింది.ఆ చనువుతోనే బుచ్చిబాబు ఎన్టీఆర్ కు కథ చెప్పగా ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు టాక్.
ఇలా ఈయన లైనప్ లో ఇద్దరు డైరెక్టర్లు ఉండగా మరొక డైరెక్టర్ కు ఎన్టీఆర్ ఓకే చెప్పినట్టు నిన్నటి నుండి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఎన్టీఆర్ తమిళ్ డైరెక్టర్ వెట్రిమారన్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు నిన్న అంతా హాట్ టాపిక్ గా చర్చించు కున్నారు.
అయితే ఈ వార్తపై క్లారిటీ వచ్చింది.ఇది కేవలం రూమర్ మాత్రమే అని ఎన్టీఆర్ లైనప్ లో కేవలం ఎం ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు మాత్రమే ఉన్నారని మరొక డైరెక్టర్ లాక్ అవ్వలేదని తాజాగా క్లారిటీ వచ్చేసింది.
దీంతో ఈ కాంబోలో సినిమా ఇంకా కన్ఫర్మ్ కానట్టే.







