ప్రస్తుతం వర్క్‌ఫ్రం హోం, ఆన్‌లైన్ క్లాసులు మాత్రమే జరుగుతున్నవి.ఈ నేపథ్యంలో అతి తక్కువ ధరలో ప్రతిరోజూ డేటాతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్ అందరిMీ అవసరం.
అయితే, వివిధ సంస్థలు అందిస్తోన్న డేటా ప్లాన్లలో ఏది మనకు తక్కువ ధరకు మనకు అందిస్తున్నాయో తెలుసుకుందాం.
ఎయిర్‌టెల్‌తో పాటు జియో, వీఐ అందిస్తోన్న 1 జీబీ ప్యాక్ బెనిఫిట్స్‌లో ఏ ఆప్షన్ బెస్ట్ మీకు తెలుసా? ఆ వివరాలు తెలుసుకుందాం.ఎయిర్‌టెల్ కేవలం రూ.199 కే 1 జీబీ అన్‌లిమిటెడ్ కాలింగ్ ప్యాక్‌ను అందిస్తోంది.దీంతో పాటు ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లను ఉచితంగా పొందవచ్చు.ఈ ప్లాన్ తక్కువ డేటా వాడే వారితోపాటు కాలింగ్ చేసుకునే వారికి ఇది బెస్ట్ ప్లాన్.ఈ ప్లాన్‌లో నెలపాటు అమెజాన్ మొబైల్ ఎడిషన్‌ను కూడా ఉచితంగా పొందవచ్చు.దీంతోపాటు వింక్ మ్యూజిక్, హలోట్యూన్స్, ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీం సర్వీస్‌ను కూడా కేవలం రూ.199 ప్యాతో పొందవచ్చు.దీని వ్యాలిడిటీ 24 రోజులు.

వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్ వాడే కొంతమంది వినియోగదారులకు డేటా అంత ఎక్కువగా ఉపయోగించకున్నా.వారికి కాలింగ్, లిమిటెడ్ డేటా ప్యాక్ అవసరముంటుంది.దీనికి జియోతోపాటు వీఐ సేమ్ ధరలకే ఇటువంటి వినియోగదారులకు అందిస్తున్నాయి.ఆ ప్లాన్స్ చూద్దాం.జియో అందిస్తోన్న రూ.199 ప్యాకేజీతో కస్టమర్లకు ప్రతిరోజూ 1.5 జీబీ డేటా 28 రోజుల వ్యాలిడిటీ ఉంటుంది.అన్‌లిమిటెడ్ కాలింగ్ ఏ నెట్‌వర్క్ అయిన చేసుకోవచ్చు.
ప్రతిరోజూ 100 ఎస్‌ఎంఎస్‌లు ఉచితం.ఈ ప్లాన్ ద్వారా ఇతర జియో యాప్స్‌ను ఉచితంగా పొందవచ్చు.
అంటే జియో టీవీ, జియో సినిమాలు యాక్సెస్ చేయవచ్చు.జియో 1 జీబీ డేటా ప్లాన్ కూడా అందిస్తోంది.
దీంతో నిరంతర కాలింగ్‌తోపాటు 100 ఎస్‌ఎంఎస్‌లు 24 రోజుల వ్యాలిడిటీతో అందిస్తోంది.ఈ ప్లాన్‌ను జియో కేవలం రూ.149 కే అందిస్తోంది.ఇది ఎయిర్‌టెల్ రూ.199 ధరతో పోలిస్తే చాలా తక్కువ.అదే రీఛార్జ్ ప్లాన్‌ను వీఐతో పోలిస్తే.రూ.199 కే ప్రతిరోజూ 1 జీబీ డేటాను అందిస్తోంది.దీంతోపాటు అన్‌లిమిటెడ్ కాలింగ్.వంద ఎస్‌ఎంఎస్‌లు కూడా అందిస్తోంది.వీఐ మూవీస్, టీవీ యాక్సెస్‌ను ఉచితంగా పొందవచ్చు.దీని వ్యాలిడిటీ 24 రోజులు.