వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజ సామాగ్రి ఇదే..!

వరలక్ష్మీ వ్రతం( Varalakshmi Vratham ) చేస్తే సకల సంపదలు సిద్ధిస్తాయని చాలామంది ప్రజలు నమ్ముతారు.

అందుకే శ్రావణమాసం( Shravanamasam ) రాగానే ఆడవారు అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం చేస్తూ ఉంటారు.

శ్రావణమాసంలో ప్రతి శుక్రవారం పవిత్రమైనదిగా భావిస్తారు.అందుకే చాలామంది శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేస్తూ ఉంటారు.

ముఖ్యంగా పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వ్రతాన్ని ఆచరిస్తారు.అయితే వ్రతం రోజు ఏమి చేయాలి? ఈ పూజ చేయడానికి కావాల్సిన సామాగ్రి ఏమిటి.కంకణం ఎలా చేయాలి? నైవేద్యంగా ఏమి సమర్పించాలి అనే విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే అమ్మవారికి పూజ( Pooja ) చేసేందుకు తెల్లవారుజామున నిద్రలేచి, పరిసరాలు శుభ్రం చేసుకోవాలి.ఆ తర్వాత మీరు తలస్నానం చేసి కొత్త దుస్తులు ధరించి పూజకు కావలసిన సామాగ్రిని( Pooja Items ) సిద్ధం చేసుకోవాలి.ముఖ్యంగా చెప్పాలంటే వ్రతానికి కావాల్సిన పూజ సామాగ్రి ముందుగా పసుపు, కుంకుమ, టెంకాయలు, దీపపు కుందులు, ఐదు వత్తులతో హారతి ఇవ్వడానికే అవసరమైన పళ్లెం, పంచహారతి దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరవత్తులు, బియ్యం, శనగలు, కంకణం కట్టుకోవడానికి దారం, ఆకులు, పువ్వులు కావాలి.

Advertisement

అంతే కాకుండా ఐదు లేదా తొమ్మిది పోగులు దారం తీసుకొని దానికి పసుపు రాయాలి.

ఆ దారానికి ఐదు లేదా తొమ్మిది ఆకులు కట్టి ముడులు వేయాలి.దాన్ని పీఠము వద్ద ఉంచి పూలు, పసుపు, కుంకుమ, అభితలు వేసి కంకణాన్ని పూజించాలి.అలా కంకణాన్ని తయారు చేసుకుని పూజకు( Varalakshmi Vratham Pooja ) సిద్ధం చేసుకోవాలి.

ఇంకా చెప్పాలంటే వాయనం ఇవ్వడానికి అవసరమైన వస్తువులు ముందుగా ఎరుపు రంగు జాకెట్ వస్త్రం, గంధం, పూలు, పండ్లు, తమలపాకులు, వక్కలు వరలక్ష్మీ వ్రతం రోజు అమ్మవారికి ప్రత్యక్షంగా తయారు చేసిన పిండి వంటలు నైవేద్యంగా సమర్పించాలి.పాయసం, పానకం, వడపప్పు, పరమాన్నం, పప్పు నెయ్యి వంటి వంటకాలు అమ్మవారికి ఎంతో ఇష్టం.

కావాల్సిన అన్ని రకాల వస్తువులను సిద్ధం చేసుకుని వ్రతం చేయాలి.శ్రావణమాసంలో ఈ వ్రతం చేస్తూ వరలక్ష్మి వ్రత కథ విన్న పూజ చేసిన సకల సౌభాగ్యాలు సిరిసంపదలు సిద్ధిస్తాయి.

మీ వెన్నెముక బ‌లంగా ఉండాలా? అయితే ఈ జాగ్ర‌త్తలు తీసుకోవాల్సిందే!
Advertisement

తాజా వార్తలు