తెలుగు ప్రేక్షకులకు 2015 సంవత్సరంలో కుమారి 21ఎఫ్ సినిమాతో పరిచయం అయిన హెబ్బా పటేల్ ఆ తర్వాత పలు సినిమా ల్లో నటించింది.మొదటి సినిమా తోనే మంచి గుర్తింపును దక్కించుకున్న హెబ్బా పటేల్ ఆ తర్వాత చేసిన సినిమా లతో పెద్దగా సక్సెస్ దక్కించుకోలేక పోయింది ఎన్నో సినిమాల్లో నటించి పర్వాలేదు అనిపించుకున్నా కమర్షియల్ గా సినిమా లతో సక్సెస్ దక్కించుకోలేక పోవడంతో ఈ అమ్మడికి అవకాశాలు మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చాయి.
ప్రస్తుతం ఐటం సాంగ్స్ మరియు వెబ్ సిరీస్ లో మాత్రమే అవకాశాలు వస్తున్నట్లుగా తెలుస్తోంది.అడపా దడపా వస్తున్న సినిమా ఆఫర్స్ ఆమెకు ఎప్పటిలాగే సక్సెస్ ని తేలేక పోతున్నాయి.
ఇటీవల ఓదెల రైల్వే స్టేషన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఓటిటి ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆ సినిమా హెబ్బా పటేల్ ని కొత్తగా చూపించింది అనడంలో సందేహం లేదు.మాస్ పాత్రలో ఆమె నటించిన తీరు ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గుర్తు చేసింది.అద్భుతమైన నటనతో ఆకట్టుకుంది అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇక సోషల్ మీడియా లో ఈమె రెగ్యులర్ గా తన కొత్త ఫొటోస్ ని షేర్ చేస్తూ ఉంటుంది.తాజాగా చీర కట్టు లో చాలా అందంగా ఉన్న ఈ ఫోటోలను షేర్ చేయడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఎల్లో చీరలో ముద్దొస్తున్న బంగారు వర్ణం లో ఈ అమ్మడిని చూస్తుంటే మతి పోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ఇంత అందంగా ఉన్నా పాపం ఈమెకు ఎందుకు ఆఫర్స్ ఎక్కువగా రావడం లేదు అర్థం కావడం లేదని అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
త్వరలో ఈమె మళ్లీ తెలుగు సినిమా ఇండస్ట్రీలో బిజీ అవుతుందనే నమ్మకమును కొందరు వ్యక్తం చేస్తున్నారు.ఈ చీర కట్టులో చూస్తుంటే అది నిజమేనేమో అనిపిస్తుంది.