జాతిరత్నాలు సినిమాతో తెలుగులో సాలిడ్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనుదీప్ కె వి.ఈ సినిమా కంటే ముందు పిట్టగోడ అనే ప్లాప్ సినిమా తో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు.
ఈ సినిమా ప్లాప్ తర్వాత జాతిరత్నాలు సినిమా చేసాడు.ఈ సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
అనుదీప్ ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకుని ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.ఇక ఈ సినిమా తర్వాత అనుదీప్ తమిళ్ హీరో శివకార్తికేయన్ తో బైలింగ్వన్ సినిమా చేస్తున్నాడు.
వీరిద్దరి కాంబోలో ప్రిన్స్ సినిమా తెరకెక్కుతుంది.ఈ మధ్య కాలంలో శివకార్తికేయన్ సినిమాలన్నీ సూపర్ హిట్ అవుతూ వస్తున్నాయి.
అలాగే ఈయన తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గర అయ్యాడు.మరి ఈ క్రమంలోనే ఈసారి ప్రిన్స్ సినిమాతో రాబోతున్నాడు.
పాండిచ్చేరి నేపథ్యంలో సాగే ఈ సినిమాను సునీల్ నారంగ్ శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ ఎల్ ఎల్ పీ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.ఇందులో బ్రిటీష్ భామ మరియా ర్యాబోష హీరోయిన్ గా నటిస్తుంది.
థమన్ సంగీతం అందిస్తున్నాడు.ఈ సినిమా నుండి వచ్చిన ప్రొమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను క్రియేట్ చేసింది.
ఇక ఈ సినిమాను దీపావళి కానుకగా అక్టోబర్ 21న రిలీజ్ చేస్తున్నారు.తాజాగా ఈ సినిమా నుండి మరొక అప్డేట్ బయటకు వచ్చింది.
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది.సెన్సార్ వారు ఈ సినిమాకు యు సర్టిఫికెట్ ఇచ్చాడు.అలాగే 2 గంటల 23 నిముషాల రన్ టైం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులను పక్కాగా అలరిస్తుంది అని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.అనుదీప్ మంచి కాన్సెప్ట్ ను మిక్స్ చేసి తెరకెక్కించాడు.
మరి ఈయన మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటాడో లేదో కొద్దీ రోజులు ఆగితే తెలుస్తుంది.