అలా ఎలాతో తెలుగు తెరకు పరిచయమై, తొలిచిత్రం తోనే మంచి విజయాన్ని అందుకుంది హెబా పటేల్.ఆ చిత్రాన్ని ప్రమోట్ చేస్తూ ఎదో ఇంటర్వ్యూ లో మాట్లాడుతుండగా దర్శకుడు సుకుమార్ కంటబడింది.
అమ్మడు చలాకితనం చూసిన సుకుమార్, తాను రాసుకున్న స్క్రిప్టుకి ఈ అమ్మాయే కరెక్ట్ అనుకోని హెబాతో కుమారి 21 ఎఫ్ నిర్మించాడు.
అంతే … రాత్రికి రాత్రే పెద్ద స్టార్ అయిపోయింది హెబా.
సమంతకి ఏ మాయ చేసావే ఎలాగో, హెబాకి కుమారి 21 ఎఫ్ అలాగా అనుకున్నారంతా.కాని అలాంటిదేమి జరగలేదు.
కొత్తగా వచ్చిన ఈడోరకం ఆడోరకం మంచి హిట్ గా నిలిలినా, అమ్మడి చేతిలో పెద్దగా అవకాశాలు లేవు.వరుణ్ తేజ్ – శ్రీను వైట్ల సినిమాలో ఈ అమ్మాయి ఉందని కాసేపు, లేదని కాసేపు అంటున్నారు.
కేవలం హిట్లనే నమ్ముకుంటే పనవ్వదు అనుకుందేమో .మ్యాగజీన్ల కోసం ఫోటోషూట్లు మొదలుపెట్టింది.ఇదిగోండి, రెడ్ మ్యాగజీన్ జూన్ ఇష్యూ మీద ఇలా తన అందాలతో కనువిందు చేసింది.ఇది చూసైనా దర్శకులు ఎంకరేజ్ చేస్తారో లేదో!
.






