అలా ఎలా తో ఎంట్రీ ఇచ్చి కుమారి 21f తో క్రేజ్ తెచ్చుకున్న హెబ్బా పటేల్ ఆ సినిమాతో వచ్చిన హాట్ ఇమేజ్ తో కొన్నాళ్లు ఛాన్స్ లు అందుకుంది.అయితే పెద్దగా పాత్ర ప్రాధాన్యతని చూడకుండా కేవలం హాట్ షోస్ తో అలరించాలని అనుకున్న హెబ్బా ఆ తర్వాత అంత క్రేజ్ తెచ్చుకోలేదు.
అందుకే హెబ్బా పటేల్ గురించి పెద్దగా డిస్కషన్స్ పెట్టలేదు.అయితే అమ్మడు కేవలం వార్తల్లో రావట్లేదు కానీ సైలెంట్ గా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది.
ఇప్పటికే అమ్మడు రెండు సినిమాలను పూర్తి చేయగా మరో రెండు సినిమాలు సెట్స్ మీద ఉన్నాయి.
అలా నిన్ను చేరి సినిమా పూర్తి చేసిన హెబ్బా పటేల్ తమిళంలో వల్లన్, ఆద్య సినిమాల్లో నటిస్తుంది.
తెలుగుతో పాటుగా తమిళంలో కూడా దూసుకెళ్తుంది హెబ్బా పటేల్.ఛాన్స్ లు లేక ఖాళీగా ఉన్న టైం లో స్పెషల్ ఐటం సాంగ్ కూడా చేసింది హెబ్బా పటేల్.
సో పైకి కనిపించడం లేదు కానీ హెబ్బా వరుస సినిమాలు చేస్తూ కెరీర్ లో దూకుడు చూపిస్తుంది. సినిమాలే కాదు వెబ్ సీరీస్ లతో కూడా ఆడియన్స్ ని అలరిస్తుంది కుమారి.