తెలుగు ప్రేక్షకులకు కుమారి 21ఎఫ్ సినిమా తో పరిచయమైన ముద్దుగుమ్మ హెబ్బా పటేల్ ఆ తర్వాత తెలుగు లో పలు సినిమాల్లో నటించింది.కానీ ఏ ఒక్క సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వలేదు.
అయినా కూడా ఈ అమ్మడి కెరియర్ ఇన్నాళ్ల పాటు సాగింది.ఒక వైపు సినిమాలు చేస్తే మరో వైపు వెబ్ సిరీస్ లను చేస్తూ కెరియర్ లో బిజీగా ముందుకు సాగిన ఈ అమ్మడు ఈ మధ్య కాలం లో కాస్త బరువు పెరిగినట్లుగా అనిపిస్తుంది.
గతంలో సన్నగా నాజూకుగా కనిపించిన హెబ్బా పటేల్ ఈ మధ్య కాలం లో మాత్రం కాస్త బరువు ఎక్కువగా అయ్యి కనిపించడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.ఇంతలో ఎంత మార్పు అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆ మధ్య ఓదెల రైల్వే స్టేషన్ సినిమాలో కనిపించిన హెబ్బా పటేల్ కాస్త బొద్దుగానే అనిపించింది.ఆ తర్వాత కూడా పలు కార్యక్రమాల్లో కనిపిస్తూ రోజు రోజు కు బరువు పెరుగుతున్నట్లుగా అనిపిస్తుంది.ఈ మధ్య కాలం లో ఒక ఈవెంట్ లో కనిపించిన హెబ్బా పటేల్ మరింతగా బరువు పెరిగినట్లుగా అనిపిస్తుందని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.కొందరు హీరోయిన్స్ బరువు పెరిగితే లావుగా అయితే అందం కోల్పోతారు.
కానీ హెబ్బా పటేల్ మాత్రం బరువు పెరిగినా కూడా ముద్దుగా బొద్దుగా ఉంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.ముందు ముందు కూడా ఈ అమ్మడు హీరోయిన్ గా వరుసగా సినిమాలు చేయాలని కోరుకుంటున్నారు.
ఈ మధ్య కాలం లో వెబ్ సిరీస్ లకు ఎక్కువగా ఈ అమ్మడు ఓకే చెప్తుంది.వెబ్ సిరీస్ లతో పాటు ముందు ముందు సినిమాల్లో కూడా ఈమె నటిస్తుందేమో చూడాలి.







