టాలీవుడ్ స్టార్ హీరోయిన్ తమన్నా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.సినిమా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి కొన్ని ఏళ్ళు పూర్తి అవుతున్న ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వరుసగా అవకాశాలను దూసుకుపోతోంది.
తమన్నా కంటే ముందు తమన్నా తర్వాత సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన పలువురు హీరోయిన్లు అవకాశాలు లేక ఇబ్బంది పడుతుండగా తమన్నా మాత్రం సినిమాలు వెబ్ సిరీస్ లు యాడ్స్ లో నటిస్తూ బాగానే సంపాదిస్తోంది.ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు పలు రకాల బ్రాండ్లకు అంబాసిడర్ గా కూడా వ్యవహరిస్తోంది.
ఇప్పటికే ఎన్నో బ్రాండ్స్ కి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న తమన్నా నిజంగా కూడా మరొక బ్రాండ్ కి అంబాసిడర్ గా ఎంపిక అయినట్టు తెలుస్తోంది.

ప్రముఖ SureRest మ్యాట్రెస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఎంపికయ్యారు.1988 నుండి తెలుగు రాష్ట్రాల మార్కెట్ లలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మ్యాట్రెస్ బ్రాండ్‌లలో SureRest ఒకటి.ఈ సంస్థ ఉత్పత్తులను కస్టమర్లకు మరింత చేరువ చేసేందుకు, రిటైల్ మార్కెట్ ను విస్తరించడానికి ప్రముఖ తెలుగు నటి తమన్నా భాటియాను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
ఈ క్రమంలోనే నిర్వాహకులు ఉత్తమ్ మలానీ, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, సెంచరీ మ్యాట్రెస్ మాట్లాడుతూ.తమన్నా SureRest కి వ్యూహాత్మకంగా చక్కగా సరిపోతారు.ప్రస్తుతం, మా ఫోకస్ అంతా ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ అలాగే ఇతర దక్షిణాది మార్కెట్ల పై ఉంది.

కాగా హీరోయిన్ తమన్నాకు రెండు తెలుగు రాష్ట్రాలలో భారీగా అభిమానులు ఉన్నారు.కాబట్టి హీరోయిన్ తమన్నా SureRest బ్రాండ్ మరింత వృద్ది చెందడానికి, ఈ అసోసియేషన్ సహాయం పడుతుందని మేం ఖచ్చితంగా నమ్ముతున్నాము అని తెలిపారు.మరోవైపు తమన్నా కూడా స్పందిస్తూ.
SureRest అనేది ఒక ఇంటి పేరు.నాణ్యత, వినూత్న ఉత్పత్తులు, శ్రేణిలను కచితత్వంగా సూచిస్తుంది.
నేను బ్రాండ్‌కు ప్రాతినిధ్యం వహించగలిగినందుకు, ప్రజలు వారి ఆరోగ్యంపై దృష్టి పెట్టడానికి వారిని ప్రోత్సహించడానికి సంతోషిస్తున్నాను.మంచి నిద్రతోనే మంచి ఆరోగ్యం సాధ్యమవుతుందీ అని చెప్పుకొచ్చింది తమన్నా.







