ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.మద్యం కుంభకోణంలో నిందితుడిగా ఉన్న బినోయ్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు.
తనకు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.కాగా గతవారం ట్రయల్ కోర్టులో బినోయ్ బాబు వేసిన బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైన విషయం తెలిసిందే.
ట్రయల్ కోర్టు తిరస్కరించడంతో బినోయ్ బాబు తాజాగా ఢిల్లీ హైకోర్టులో పిల్ వేశారు.ఈ క్రమంలో పిటిషన్ పై హైకోర్టు ఈడీని వివరణ కోరింది.







