రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సందడి వాతావరణం నెలకొంది.జైలు వద్దకు టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు.
ఈ క్రమంలోనే జైలు వద్దకు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి చేరుకున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో సెంట్రల్ జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది.
ఈ క్రమంలో సెంట్రల్ జైలు నుంచి రాజమండ్రి మధురపూడి ఎయిర్ పోర్టు వరకు చంద్రబాబు భారీగా ర్యాలీగా వెళ్లనున్నారు.అనంతరం ప్రత్యేక విమానంలో తిరుమలకుు వెళ్లే అవకాశం ఉందని సమాచారం.
స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో భాగంగా ఏపీ హైకోర్టు చంద్రబాబుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే.ఈ క్రమంలో కోర్డు ఆర్డర్లు వచ్చిన తరువాత జైలులో ఫార్మాలిటీస్ పూర్తి కాగానే చంద్రబాబు బయటకు రానున్నారని తెలుస్తోంది.