మష్రూమ్స్( Mushrooms ). వీటినే పుట్టగొడుగులు అని అంటారు.
ఇటీవల కాలంలో మనకు ఏడాది పొడవునా మష్రూమ్స్ మార్కెట్లో లభిస్తున్నాయి.పిల్లల నుంచి పెద్దల వరకు చాలా మంది మష్రూమ్స్ ను ఇష్టంగా తింటుంటారు.
రుచిలోనే కాదు పోషకాల పరంగా కూడా మష్రూమ్స్ అమోఘం అని చెప్పాలి.వీటిలో విటమిన్ డి, విటమిన్ సి, విటమిన్ బి, ఐరన్, మెగ్నీషియం, ప్రోటీన్, ఫైబర్ తో పాటు శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్( Antioxidants ) నిండి ఉంటాయి.
అందుకే మష్రూమ్స్ ని డైట్ లో చేర్చుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది.ముఖ్యంగా ప్రస్తుత ఈ చలికాలంలో మష్రూమ్స్ ని కచ్చితంగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
అందుకు కారణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ఈ చలికాలంలో దాదాపు అందరి రోగ నిరోధక వ్యవస్థ బలహీనపడుతుంది.దాంతో జలుబు, దగ్గు, జ్వరం వంటి సీజనల్ వ్యాధులు తెగ ఇబ్బంది పెడుతూ ఉంటాయి.అయితే మష్రూమ్స్ డైట్ లో చేర్చుకోవడం వల్ల వాటిలో ఉండే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఇమ్యూనిటీ బూస్టర్ గా పనిచేస్తాయి.
మన రోగ నిరోధక వ్యవస్థను బలపరిచి సీజనల్ వ్యాధులకు( Seasonal Disease ) అడ్డుకట్ట వేస్తాయి.అలాగే ఈ వింటర్ సీజన్ లో మార్నింగ్ ఎండ చాలా తక్కువగా ఉంటుంది.
ఒకవేళ కొద్దో గొప్పో ఎండ ఉన్నా చలి కారణంగా పొద్దున్నే బయటకు రావడానికి అస్సలు ఇష్టపడరు.
దీంతో ఎక్కువ శాతం మంది విటమిన్ డి లోపానికి గురవుతుంటారు.అయితే ఈ సమస్యకు మష్రూమ్స్ చెక్ పెడతాయి.ఎందుకంటే విటమిన్ డి దొరికే అతికొద్ది ఆహారాల్లో మష్రూమ్స్ ఒకటి.
అందువల్ల వీటిని చలికాలం( Winter )లో తీసుకుంటే విటమిన్ డి కొరత ఏర్పడకుండా ఉంటుంది.ఇక వింటర్ లో మష్రూమ్స్ ను డైట్ లో చేర్చుకుంటే గట్ హెల్త్ మెరుగుపడుతుంది.
కొలెస్ట్రాల్ కరిగి గుండె ఆరోగ్యంగా మారుతుంది.ఒత్తిడి, డిప్రెషన్ ( Depression )వంటి మానసిక సమస్యలు పరారవుతాయి.
మైండ్ చురుగ్గా పనిచేస్తుంది.మరియు మష్రూమ్స్ వల్ల క్యాన్సర్ వచ్చే రిస్క్ సైతం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.