టీపీటీఎఫ్ రాజన్న సిరిసిల్ల జిల్లా శాఖ డిమాండ్ రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రస్తుతం జరుగుతున్న సాధారణ ఎన్నికల విధుల కేటాయింపులో అవకతవకలు జరిగాయని వాటిని వెంటనే సరిచేసి తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి,ఎన్నికల మ్యాన్ పవర్ అధికారి ఏ రమేష్ కుమార్( Ramesh Kumar ) లకు టీపీటీఎఫ్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు దోర్నాల భూపాల్ రెడ్డి, దుమాల రమనాథ్ రెడ్డి( Dornala Bhupal Reddy, Dumala Ramanath Reddy ) లు వినతి పత్రం అందించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సీనియర్లకు ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులు చాలామందికి కేటాయించలేదని.
కొంతమంది జూనియర్లకు ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ విధులు నిర్వహించడానికి ఉత్తర్వులు అందాయని వాటిని వెంటనే సరిచేసి తగు చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.జూనియర్లు ప్రిసైడింగ్ ఆఫీసర్ గా ఉన్నచోట్ల వారి దగ్గర సీనియర్లు ఓపిoఒ గా పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని, దానివల్ల వారి మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంటుందన్నారు.
కాబట్టి సరియైన నిర్ణయం తీసుకోవాలని వారు కోరారు.ఎన్నికల విధులు కేటాయింపులో ఉద్యోగుల పే స్కేల్ ఆధారంగా బేసిక్ పే ని పరిగణలోకి తీసుకొని విధులు కేటాయిస్తే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం కావని వారు తెలిపారు.
ఇప్పటికైనా బేసిక్ పే ప్రకారం విధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.మన జిల్లాలో ఉన్న రెండు నియోజకవర్గాలలో ఇలాంటి పొరపాట్లు జరిగాయని వాటిని వెంటనే సరిదిద్దాలని లేనియెడల జిల్లా పాలనాధికారి కి తగు చర్యలు నిమిత్తం ప్రాతినిధ్యం చేస్తామని వారు తెలియజేశారు.