ఏపీలో పలు జిల్లాల్లో గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నాయి.కోస్తా, రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న వానలతో జనజీవనం అస్తవ్యస్థం అయింది.
పలు ప్రాంతాల్లో రహదారులు కొట్టుకుపోవడంతో వాహన రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.
మరోవైపు వర్షాల ప్రభావంతో వ్యవసాయ పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది.దీంతో రైతన్నలు ఆందోళన చెందుతున్నారు.
కాగా ఏపీలో మరో రెండు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వెల్లడించింది.







