భారత తదుపరి సీజేఐ ఎంపికపై కేంద్రం కసరత్తు చేస్తోంది.ఈ క్రమంలో తదుపరి సర్వోన్నత న్యాయస్థానానికి సీజేఐగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ను నియమించే అవకాశం ఉంది.
అయితే, తదుపరి సీజేఐగా ఎవరిని నియమించాలో సూచించాలని ప్రస్తుత సీజేఐ జస్టిస్ లలిత్ కు కేంద్ర న్యాయశాఖ లేఖ రాసింది.సీజేఐ సూచించిన పేరును తదుపరి సీజేఐగా కేంద్రం ఖరారు చేయనుంది.
కాగా నవంబర్ 8న సీజేఐ జస్టిస్ లలిత్ పదవీ విరమణ చేయనున్నారు.జస్టిస్ లలిత్ తర్వాత సీనియర్ న్యాయమూర్తిగా జస్టిస్ డీవై చంద్రచూడ్ ఉన్నారు.
దీంతో ఆయనే తదుపరి సీజేఐ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.







