భారత్ సారధి రోహిత్ శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.ఇటీవల వన్డే ప్రపంచ కప్ టోర్నీలో అద్భుతంగా జట్టును ముందుండి నడిపించాడు.
కెప్టెన్ గా రోహిత్ శర్మ తీసుకున్న చాలా నిర్ణయాలు భారత్ గెలవడంలో ప్రముఖ పాత్ర పోషించాయి.కెప్టెన్ గా నిర్ణయాలు తీసుకోవటంతో పాటు ఓపెనర్ గా… ప్రతి మ్యాచ్ లో రోహిత్ శర్మ దూకుడుగా గేమ్ ఆడాడు.
కానీ ఫైనల్ మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోవడం… కప్ చేజారిపోవడం.అందరినీ ఎంతో నిరాశ కలిగించింది.
ఈ క్రమంలో కెప్టెన్ రోహిత్ శర్మ.ప్రపంచకప్ ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయాడు.
ఇదిలా ఉంటే రోహిత్ శర్మ ఐపీఎల్ టోర్నీలో ముంబై సారధిగా గత కొన్ని సంవత్సరాల నుండి రాణిస్తున్న సంగతి తెలిసిందే.కానీ తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మ స్థానంలో.హర్ధిక్ నీ ప్రకటించడం జరిగింది.దీంతో రోహిత్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు.ఐపీఎల్ టోర్నీలో రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ ఐదుసార్లు ట్రోఫీ టైటిల్ గెలవడం జరిగింది.రోహిత్ శర్మ కెప్టెన్సీలో ముంబై ఇండియన్స్ 158 మ్యాచ్ లు ఆడగా 87 విజయం సాధించగా 67 ఓటమి పాలు కావటం జరిగింది.
నాలుగు సార్లు టై అయ్యాయి.ఈ క్రమంలో ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా రోహిత్ శర్మని పక్కకు తప్పించడం.
సంచలనంగా మారింది.