MLC Kavitha : ఎమ్మెల్సీ కవిత పిటిషన్ పై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha )పిటిషన్ పై ఎల్లుండి సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.

ఢిల్లీ లిక్కర్ స్కాం( Delhi Liquor Scam ) కేసులో తన అరెస్ట్ అక్రమమని ఎమ్మెల్సీ కవిత పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే ఈడీని ప్రతివాదిగా చేర్చుతూ కవిత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.కాగా కవిత పిటిషన్ ను జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ బేలా ఎం త్రివేది( Justice MM Sundaresh, Justice Bela M Trivedi ) ధర్మాసనం విచారించనుంది.

కాగా రాజ్యాంగ విరుద్ధంగా, ఏక పక్షంగా ఈడీ తనను అరెస్ట్ చేసిందని కవిత ఆరోపించారు.మహిళల విషయంలో పాటించాల్సిన నిబంధనలను ఉల్లంఘించారని పిటిషన్ లో పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తన రిమాండ్ ను రద్దు చేయాలన్న ఎమ్మెల్సీ కవిత ఈడీ కస్టడీ నుంచి తనను విడుదల చేయాలని పిటిషన్ లో తెలిపారు.

Advertisement
చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు