ఫోన్ ట్యాపింగ్ కేసులో( Phone Tapping Case ) నిందితుల కస్టడీ పిటిషన్ పై విచారణ జరిగింది.ఈ మేరకు అడిషనల్ ఎస్పీలు భుజంగరావు,( Bhujangarao ) తిరుపతన్న( Tirupatanna ) మరియు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( Praneeth Rao ) కస్టడీకి ఇవ్వాలని కోరుతూ నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలైన సంగతి తెలిసిందే.
ఈ పిటిషన్ పై న్యాయస్థానం విచారణ జరపగా కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని నిందితుల తరపు లాయర్లు కోరారు.దీంతో రేపటిలోగా కౌంటర్ దాఖలు చేయాలని నాంపల్లి కోర్టు( Nampally Court ) ఆదేశాలు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను నాంపల్లి కోర్టు రేపటికి వాయిదా వేసింది.







