టీడీపీ అధినేత చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ పై రేపు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.ఈ మేరకు కోర్టు నెంబర్ ఆరులో 63వ ఐటమ్ గా చంద్రబాబు కేసు చేరింది.
చంద్రబాబు కేసుపై జస్టిస్ అనిరుద్ద్ బోస్, జస్టిస్ బేలా త్రివేది ధర్మాసనం విచారణ జరపనుంది.కాగా చంద్రబాబు తరపున న్యాయవాది సిద్దార్థ్ లూథ్రా వాదనలు వినిపించనున్నారు.
అయితే సెప్టెంబర్ 23వ తేదీన చంద్రబాబు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.సెప్టెంబర్ 27న జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఈ పిటిషన్ పై విచారణ జరపకపోవడంతో సీజేఐ మరో బెంచ్ ముందుకు కేసును లిస్ట్ చేసింది.







