అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది.ఈ పిటిషన్ పై ఇప్పటికే చంద్రబాబు తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
ఇవాళ సీఐడీ తరపు న్యాయవాదులు కోర్టులో తమ వాదనలను వినిపించనున్నారు.ఈ మేరకు ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో సుమారు 470 పేజీలతో కూడిన అడిషనల్ అఫిడవిట్ దాఖలు చేసిన సీఐడీ చంద్రబాబుకు ఈ కేసులో బెయిల్ మంజూరు చేయొద్దని అఫిడవిట్ లో పేర్కొంది.
ఈ క్రమంలోనే మాస్టర్ ప్లాన్ లో వైలెన్షన్ జరిగిందని సీఐడీ కోర్టుకు తెలిపింది.కాగా ఈ పిటిషన్ పై సీఐడీ వాదనలు విన్ననున్న న్యాయస్థానం తీర్పును వెలువరించే అవకాశం ఉంది.
అదేవిధంగా ఇసుక పాలసీలో అక్రమాలంటూ నమోదైన కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ పై కూడా ఏపీ హైకోర్టు విచారణ చేపట్టనుంది.







