టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ మేరకు సీఐడీ తరపు న్యాయవాది కౌంటర్ దాఖలు చేశారు.
కౌంటర్ లో సవరణలు చేసి మళ్లీ పిటిషన్ దాఖలు చేయాలని ఏసీబీ కోర్టు జడ్జి సూచించారు.ఈ క్రమంలోనే చంద్రబాబు కస్టడీ విచారణ నివేదికను సీఐడీ న్యాయస్థానానికి సమర్పించింది.
ఈ మేరకు నివేదికను సీల్డ్ కవర్ లో సీఐడీ అధికారులు సమర్పించారు.మరోవైపు చంద్రబాబును ఐదు రోజుల కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ నేపథ్యంలో ఏసీబీ కోర్టు విచారణను వాయిదా వేసింది.







