తెలంగాణలో సంచలనం సృష్టించిన పదో తరగతి హిందీ ప్రశ్నాపత్రం లీక్ కేసుపై రాష్ట్ర హైకోర్టు విచారణ జరిపింది.ఈ కేసులో విద్యార్థిపై ఉన్న డీబార్ ను న్యాయస్థానం ఎత్తివేసింది.
కాగా కమలాపూర్ పరీక్షా కేంద్రంలో హిందీ పేపర్ లీక్ కు కారణమంటూ విద్యార్థి హారీశ్ ను డీఈవో డీబార్ చేసిన సంగతి తెలిసిందే.అయితే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో హరీశ్ టెన్త్ పరీక్షలు రాశాడు.
ఈ క్రమంలోనే హరీశ్ టెన్త్ పరీక్షా ఫలితాలను వెంటనే ప్రకటించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.కాగా వరంగల్ జిల్లాలోని కమలాపూర్ జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల నుంచి హిందీ ప్రశ్నాపత్రం వాట్సాప్ లో చక్కర్లు కొట్టిన ఘటన ప్రకంపనలు సృష్టించిన సంగతి తెలిసిందే.







