నటి అనుష్క( Anushka )నవీన్ పోలిశెట్టి( Naveen Polishetty ) హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి.చాలా సంవత్సరాల తర్వాత అనుష్క తెరపై సందడి చేస్తున్నారు.
ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది చాలా రోజుల తర్వాత అనుష్కను తెరపై చూడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇలా ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడంతో చిత్ర బృందం ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఈ సినిమాలో అనుష్క ఒక చెఫ్ పాత్రలో నటించారనే సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సందర్భంలో డైరెక్టర్ పి మహేష్ బాబు( P.Mahesh Babu )ఒక ఇంటర్వ్యూలో పాల్గొని ఈ సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైనటువంటి విషయాలను వెల్లడించారు.ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ తాను ఈ సినిమా కథను 2019వ సంవత్సరంలోని సిద్ధం చేసుకున్నానని తెలిపారు.
అయితే అనుష్క స్నేహితులు నాకు తెలుసు వారికి ఈ కథ చెబితే అనుష్క వద్దకు వెళుతుందని తద్వారా పలువురికి ఈ కథ రీచ్ అయ్యి తనకు అవకాశం వస్తుందన్న ఉద్దేశంతో తన స్నేహితుడికి చెప్పగా ఏకంగా అనుష్క దగ్గరికి తీసుకువెళ్లారని మహేష్ తెలిపారు.
తాను అనుష్క దగ్గరకు వెళ్లిన సమయానికి అక్కడే యువి ప్రొడ్యూసర్స్ కూడా ఉన్నారు.ఇక అనుష్క నన్ను కథ చెప్పమని అడగడంతో తనకు కథ చెప్పడానికి తాను భయపడ్డానని కానీ ఆమె మాత్రం నేను కథ చెప్పే సమయంలో బాగా ఎంజాయ్ చేస్తూ ఇంప్రెస్స్ అవ్వడమే కాకుండా ఈ సినిమాని వాళ్లే ప్రొడ్యూస్ చేస్తామని అనుష్క కూడా నటిస్తానని చెప్పడంతో తన సంతోషానికి అవధులు లేకుండా పోయాయని తెలియజేశారు.ఇక ఈ సినిమాని 2020లో ప్రారంభించాము ఇంకా అదే సమయంలోనే లాక్ డౌన్ పడటంతో సినిమాకు చాలా గ్యాప్ వచ్చేసిందని మహేష్ తెలిపారు.
ఇక నవీన్ పోలిశెట్టిని ఫైనల్ అనుకున్న తర్వాత ఈయన అమెరికా వెళ్ళిపోయి అక్కడే చిక్కుకున్నారు.ఇలాంటి కారణాలవల్ల ఈ సినిమా ఆలస్యం అవుతూ వచ్చిందని డైరెక్టర్ తెలిపారు.ఇకపోతే ఈ సినిమాకు టైటిల్ పెట్టడం గురించి కూడా ఈయన ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.నవీన్ పోలిశెట్టితో అనుష్క సినిమా చేస్తుందనే విషయాన్ని అధికారికంగా ప్రకటించిన సమయంలో ఒక పేపర్లో శెట్టితో పోలిశెట్టి అనే హెడ్డింగ్ చూసాను.
అది తనకు ఎంతగానో నచ్చింది ఈ కథ కూడా వీరిద్దరి మధ్యనే ప్రధానంగా సాగుతుంది కనుక ఈ సినిమాకు మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి ( Miss Shetty Mister Polishetty )అనే టైటిల్ కరారు చేసామంటూ ఈ సందర్భంగా డైరెక్టర్ ఈ సినిమా టైటిల్ గురించి చెప్పినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.