నిశ్శబ్దపు నడక గురించి విన్నారా? అదో విప్లవమట, ట్రెండ్ అవుతోంది మరి?

సోషల్‌ మీడియా( Social media ) అందుబాటులోకి వచ్చాక రకరకాల ట్రెండులు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొస్తున్నాయి.ఈ క్రమంలో కొన్ని వింతగా అనిపిస్తే, మరికొన్ని చాలా విడ్డూరంగా అనిపిస్తూ వుంటాయి.

 Heard Of The Silent Walk Is It A Revolution, A Trend , Silent Walk, Social Med-TeluguStop.com

ఆ మధ్య క్వైట్ క్విట్టింగ్‌ అంటూ కొంతమంది వ్యక్తులు చేసిన ట్రెండ్‌ సంగతి గురించి మీరు వినే వుంటారు కదా! వృత్తి జీవితంలో తన పని వరకు మాత్రమే పరిమితం కావడాన్ని క్వైట్‌ క్విట్టింగ్‌ అంటారు.అలాగే చాలా మంది సోమవారం వస్తుందంటే చాలు తెగ నీరసపడిపోతుంటారు.

వీరి కోసమే అన్నట్టుగా బేర్‌ మినిమమ్‌ మండేస్‌ అంటూ ఇపుడు కొత్త ట్రెండ్‌ ఒకదానిని తెరమీదకు తెచ్చారు.అంటే సోమవారాలు పెద్దగా పనులు పెట్టుకోకపోవడం అని అర్ధం.

Telugu Maddie, Mady Mai, Trend, Quiet, Walk, Walk Benefits-Latest News - Telugu

ఈ క్రమంలోనే తాజాగా సైలెంట్‌ వాకింగ్‌ అనే ట్రెండ్‌ మొదలయ్యింది.అంటే టెక్నాలజీకి దూరంగా ఉండి నడక సాగించడం అంట.ఐడియా బాగానే ఉంది కదూ! ఈ సైలెంట్‌ వాకింగ్‌ సృష్టికర్త అమెరికాకు చెందిన మ్యాడీ మే( Mady Maio ) అనే పాడ్‌కాస్టర్‌.అయితే ఈ ఆలోచన ఈయనకు వచ్చిందేమీ కాదు.

వాకింగ్‌ చేసేటప్పుడు టెక్నాలజీకి దూరంగా ఉండాలని ఆయన భార్య సూచించిందట! అంటే ఎయిర్‌పాడ్స్‌, పాడ్‌కాస్ట్‌ లు, మ్యాజిక్‌ వంటి వాటికి దూరంగా ఉండటమన్నమాట! మొదట్లో ఇలా నడవడం కొంచెం కష్టంగానే అనిపించినా తరువాత తరువాత ఆయనకు బాగా అలవాటయ్యిందట! ఇది తన టిక్‌టాక్‌ వీడియోలో చెప్పగా ప్రస్తుతం ఈ వీడియో ట్రెండ్‌ అవుతోంది.ఇప్పటికే 6 లక్షల మందికిపైగా ఈ వీడియోను చూశారు.

Telugu Maddie, Mady Mai, Trend, Quiet, Walk, Walk Benefits-Latest News - Telugu

అంతేకాదండోయ్, చాలామంది నెటిజనం దీనిపైన కామెంట్స్ చేస్తున్నారు.కొంతమంది ఈ భయంకరమైన కాంక్రీట్ జంగిల్ లో అప్పుడప్పుడు అలా బతికితే మనం కూడా మనుషులమే అనే విషయం స్ఫురణకు వస్తుంది అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు.అవును, ఒంటరిగా నడవడం వల్ల కొత్త ఆలోచనలు వస్తాయి.టెక్నాలజీని దూరం పెట్టడం ద్వారా మెదడుకు అందుకు కావాల్సిన స్పేస్ మనం ఇస్తాం.నిశ్శబ్దంగా నడవడం వల్ల ప్రతిదీ వినగగులుతున్నాను, ఆస్వాదించగలగుతున్నాను.ప్రతిదీ చూడగలుగుతున్నాను.

నేను ప్రయత్నించాను.వీలైతే మీరూ చేయండి… అని మ్యాడీ మే చెబుతున్నారు.

మీరు కూడా ట్రై చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube