క‌రోనా టైమ్‌లో పొద్దుతిరుగుడు విత్తనాలు తింటే ఈ సూప‌ర్ బెనిఫిట్స్ మీవే!

క‌రోనా వైర‌స్‌.ఎక్క‌డ చూసినా ఈ పేరే వినిపిస్తోంది.

అమ్మో.

క‌రోనా వ‌చ్చేస్తుందేమో అన్న భ‌యం ప్ర‌జ‌ల‌ను వీడ‌డం లేదు.

మ‌రోవైపు వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావ‌డం లేదు.కాబ‌ట్టి, క‌రోనా నుంచి మ‌న‌ల్ని మ‌న‌మే ర‌క్షించుకోవాలి.

అలా ర‌క్షించుకోవాలంటే త‌గిన జాగ్ర‌త్త‌లు ప‌ట్టించ‌డంతో పాటు పోష‌కాహారం తీసుకోవాలి.అయితే ఈ స‌మ‌యంలో పొద్దుతిరుగుడు విత్తనాలు( సన్‌ఫ్లవర్ సీడ్స్) ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

Advertisement

మ‌రి పొద్దుతిరుగుడు విత్తనాల వ‌ల్ల బెనిఫిట్స్ ఏంటీ అన్న‌ది అస్స‌ల లేట్ చేయ‌కుండా చూసేయండి.సాధార‌ణంగా పొద్దుతిరుగుడు విత్త‌నాల నూనెను చాలా మంది వంట‌ల్లో వాడుతుంటారు.

అయితే పొద్దుతిరుగుడు విత్త‌నాలు కూడా తీసుకోవ‌చ్చు.కాస్త తియ్యగా, పప్పు పదార్థంతో క‌లిగి ఉండే ఈ పొద్దుతిరుగుడు విత్త‌నాల‌ను స్నాక్స్‌గా తింటుంటారు.

అయితే పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవ‌డం వ‌ల్ల ఇందులో ఉండే ఫైబ‌ర్ జీర్ణ స‌మ‌స్య‌ల‌ను దూరం చేస్తుంది.ముఖ్యంగా మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌ను దూరం చేస్తుంది.

అలాగే ఈ పొద్దుతిరుగుడు విత్తనాలు తీసుకోవ‌డం శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ క‌రిగించి.మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది.

శోభన్ బాబు కలర్ గురించి జయలలిత తల్లి అలా అన్నారా.. అసలేం జరిగిందంటే?
ప్రశాంత్ వర్మ లాంటి డైరెక్టర్ ఇండస్ట్రీలో మరొకరు లేరా..? ఆయనకి ఎందుకంత క్రేజ్...

త‌ద్వారా గుండె పోటు ఇత‌ర గండె జ‌బ్బుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.అదే స‌మ‌యంలో ర‌క్త‌పోటు కూడా కంట్రోల్‌లో ఉంటుంది.

Advertisement

విట‌మిన్ సి, బి6 తో పాటు జింక్ కూడా పొద్దుతిరుగుడు విత్త‌నాల్లో ఉంటుంది.కాబ‌ట్టి, రోజూ ఓ పావు కప్పు ఈ విత్త‌నాలు తీసుకోవ‌డం వ‌ల్ల రోగ నిరోధ‌క శ‌క్తి బ‌ల‌ప‌డుతుంది.

అదేవిధంగా. జలుబు, దగ్గును తగ్గించ‌డంతో పాటు శ్వాస సంబంధిత స‌మ‌స్య‌లను కూడా దూరం చేస్తాయి.

ఆస్తమాను నివారించడంలో కూడా ఈ విత్త‌నాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.అలాగే ఈ విత్త‌నాల్లో ఉండే విట‌మిన్-ఈ చ‌ర్మ ఆరోగ్యాన్ని ర‌క్షిస్తుంది.

ఇక పొద్దుతిరుగుడు విత్తనాల్లో ఉండే కాల్షియం ఎముకుల‌ను, కండ‌రాల‌ను, దంతాల‌ను దృఢంగా మారుస్తుంది.

తాజా వార్తలు