నాన‌బెట్టిన ప‌ల్లీలు ప్ర‌తి రోజు తింటే ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

ప‌ల్లీలు. వీటినే చాలా మంది వేరుశెన‌గ‌ల‌ని కూడా పిలుస్తుంటారు.ప‌ల్లీల‌ను కూరల్లో, చట్నీల్లో విరి విరిగా వాడుతుంటారు.

స్వీట్స్ త‌యారు చేస్తారు.అలాగే వేపుకొని, ఉడక బెట్టుకొని కూడా తింటారు.

ఎలా తిన్నా ప‌ల్లీల రుచి అద్భుతంగా ఉంటుంది.ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తాయి.

అయితే నాన‌బెట్టిన ప‌ల్లీల‌ను తీసుకుంటే.మ‌రిన్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చ‌ని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Advertisement
Health Benefits Of Soaked Peanuts! Health, Benefits Of Soaked Peanuts, Soaked Pe

మ‌రి ఆ బెనిఫిట్స్ ఏంటో లేట్ చేయ‌కుండా ఓ లుక్కేసేయండి.ప్ర‌తి రోజు నాన బెట్టిన ప‌ల్లీల‌ను ప‌ది చ‌ప్పున తీసుకుంటే.

అందులో ఉండే పోష‌కాలు శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను క‌రిగించి, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.దాంతో గుండె పోటు, ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు రాకుండా ఉంటాయి.

గుండె ఆరోగ్యం మెరుగు ప‌డుతుంది.చాలా మంది బ‌రువు పెరిగిపోతామేమోన‌ని ప‌ల్లీల‌ను ఎవైడ్ చేస్తారు.కానీ, నాన‌ బెట్టిన ప‌ల్లీల్లో ఫైబ‌ర్ పుష్క‌లంగా ఉంటుంది.

అందువల్ల‌, రెగ్యుల‌ర్ వీటిని తీసుకుంటే.వెయిట్ లాస్ అవ్వొచ్చు.

తెలుగు రాశి ఫలాలు - సెప్టెంబర్ 03 గురువారం, 2020

నాన‌బెట్టిన ప‌ల్లీల్లో కాల్షియం అత్య‌ధికంగా ఉంటుంది.కాబ‌ట్టి, వీటిని తీసుకుంటే ఎముక‌లు, కండ‌రాలు మ‌రియు దంతాలు బ‌లంగా మార‌తాయి.

Health Benefits Of Soaked Peanuts Health, Benefits Of Soaked Peanuts, Soaked Pe
Advertisement

ఒత్తిడి, డిప్రెష‌న్‌, ఆందోళ‌న వంటి మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో బాధ ప‌డే వారు.ప్ర‌తి రోజు నాన బెట్టిన ప‌ల్లీలు తీసుకోవాలి.ఇలా చేస్తే మాన‌సిక స‌మ‌స్య‌లు క్ర‌మంగా దూరం అవుతాయి.

అదేవిధంగా, మెద‌డు ప‌ని తీరు మెరుగు ప‌డుతుంది.జ్ఞాపక శక్తి రెట్టింపు అవుతుంది.

మ‌తి మ‌రుపు స‌మ‌స్య త‌గ్గు ముఖం ప‌డుతుంది.ఇక నాన‌బెట్టిన ప‌ల్లీలు చ‌ర్మ ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి.

రెగ్యుల‌ర్‌గా నాన బెట్టిన ప‌ల్లీలు తీసుకుంటే.చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా మారుతుంది.

చ‌ర్మంపై ముడ‌త‌లు, స‌న్న‌ని గీత‌లు ఏర్ప‌డ‌కుండా ఉంటాయి.

తాజా వార్తలు