ఉల్లిపాయల‌తో ఎన్ని ప్రయోజ‌నాలో చూడండి

ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయలేదు అంటారు.అది సామెత మాత్రమే కాదు అక్షరాలా నిజం.

మనం నిత్యం వాడే ఉల్లిపాయలో ఎన్నో రకాల ఆరోగ్య కారక గుణాలు ఉన్నాయి.అవేంటో మీరు తెలుసుకోండి.

పళ్ళు పుచ్చిపోయిన వాళ్ళు ఉల్లిపాయ రసం, మంచి నునే ని సమపాళ్ళలో కలిపి ఆ మిశ్రమాన్ని రోజుకి నాలుగైదు చుక్కలు పళ్ళకి పుచ్చు ఉన్న చోట పట్టిస్తే అందులో పురుగు చనిపోతుంది,అంతేకాదు ఒక్క రోజులో పండి పోటు కూడా తగ్గిపోతుంది.అరకప్పు ఉల్లి రసం, ఒక స్పూన్ తేనే కలిపిన మిశ్రమాన్ని రోజుకి రెండు పూటలా 20 రోజులు వాడినట్లయితే మగవారిలో వీర్య శక్తి బాగా పెరుగుతుంది.

ముక్కు నుండి రక్తం వస్తున్నప్పుడు సగం చేసిన ఉల్లిపాయని ముక్కుదగ్గర పెట్టి వాసన చూసినట్లయితే వెంటనే రక్త స్త్రావం ఆగిపోతుంది.పిల్లలు ఏడవకుండా నిద్ర బాగా పట్టాలి అంటే ఉల్లిపాయని నీళ్ళలో వేసి వేడి చేసి ఆ నీటిలో రెండు స్పూన్స్ చెక్కర వేసి పిల్లలకి పట్టిస్తే హాయిగా నిద్రపోతారు.

Advertisement

చాలా మందికి ఉల్లిపాయల్ని కోసేటప్పుడు కళ్ళలోకి ఘాటు వెళ్లి నీళ్ళు కారుతూ ఉంటాయి,నిజానికి అలా జరగడం కూడా చాలా మంచింది ఎందుకంటే ఉల్లి ఘాటు కంటి లోపలి వెళ్లి కళ్ళలో ఉండే దుమ్ము కణాలని బయటకి వచ్చేలా చేస్తాయి.చాలా మందికి చెవి నొప్పి వస్తుంది అలాంటప్పుడు ఉల్లిపాయ రసం వేడిచేసి చల్లారిన తరువాత చెవిలో రెండు చుక్కలు వేసినట్లయితే చెవి నొప్పి తగ్గిపోతుంది.

అజీర్తి వాంతులు ,విరోచనాలు ఎక్కువగా అవుతున్న వారు ఉల్లి రసం అరకప్పు తీసుకుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగితే వాంతులు ,విరోచనాలు తగ్గిపోతాయి.

Advertisement

తాజా వార్తలు