పచ్చి మామిడికాయ తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..?

వేసవికాలం వచ్చిందంటే చాలు ఆ సీజన్ మొత్తం మామిడికాయ( Mangoes )లతో నిండి ఉంటుంది.ఇక మరి ముఖ్యంగా పచ్చి మామిడికాయలు తినడానికి చాలామంది ఇష్టపడతారు.

ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు పచ్చి మామిడి కాయలు తినడానికి మరింత ఇష్టపడతారు.అయితే పచ్చి మామిడికాయ తినడం చాలా మంచిది.

దీని వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.ఎందుకంటే పచ్చి మామిడికాయ( Raw Mango )లలో విటమిన్లు అధికంగా ఉంటాయి.

ఇందులో క్యాల్షియం, ఆంటీ ఆక్సిడెంట్లు, ఐరన్, విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ కె, విటమిన్ b6, మెగ్నీషియం పుష్కలంగా ఉంటాయి.దీన్ని తినడం వల్ల శరీరంలో తెల్ల రక్త కణాలు( White Blood Cells ) పెరుగుతాయి.

Advertisement

అలాగే శరీరాన్ని బాహ్య వైరస్లతో కూడా పోరాడడానికి ప్రేరేపిస్తుంది.మామిడిలో పొటాషియం, మెగ్నీషియం లాంటి ముఖ్యమైన పోషకాలు ఉన్నాయి.

ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో అలాగే రక్త ప్రవాహాన్ని సాఫీగా చేయడంలో ఉపయోగపడతాయి.

రక్తనాళాలను శుభ్రపరుస్తాయి.అంతేకాకుండా తక్కువ రక్తపోటు( Blood Pressure ) సమస్యను కూడా దూరం చేస్తుంది.ఇందులో ఉండే పోషకాల కారణంగా పచ్చి మామిడికాయ క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులతో పోరాడడానికి సహాయపడుతుంది.

ఇది విటమిన్ సి( Vitamin C ) లక్షణాలు కలిగి ఉంది.అలాగే ఇది ఆక్సీకరణ ఒత్తిడి నుండి కూడా రక్షిస్తుంది.వైద్య నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలీఫేనాల్స్ లుకేమియా, పెద్ద ప్రేగు, ఊపిరితిత్తులు, అలాగే రొమ్ము క్యాన్సర్ లాంటి ప్రమాదకరమై క్యాన్సర్ కణాలు( Cancer )ఏర్పడకుండా నిరోధిస్తాయి.

మోయే మోయే మూమెంట్స్ ఫేస్ చేసిన టాప్-3 సినిమా సెలబ్రిటీస్
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన 17 ఏండ్లకు తొలిసారి డబ్బింగ్ చెప్పిన విజయశాంతి..

ఇక డయాబెటిక్( Diabetic ) పేషెంట్లు కూడా పచ్చి మామిడికాయను కచ్చితంగా తీసుకోవాలి.ఎందుకంటే ఇది శరీరంలో చక్కెర స్థాయిని సమతుల్యతంగా ఉంచుతుంది.ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉన్నందువలన ఇది ఐరన్ లోపాన్ని కూడా సరిచేస్తుంది.

Advertisement

వేసవికాలంలో పచ్చిమామిడి తీసుకోవడం వలన శరీరం హైడ్రేట్ గా ఉంటుంది.అంతేకాకుండా వడదెబ్బ కూడా తగలకుండా ఇది మమ్మల్ని కాపాడుతుంది.

అలాగే జీర్ణక్రియ సమస్యలను( Digestion Problems ) కూడా తగ్గిస్తుంది.జీర్ణక్రియ పనితీరును మెరుగుపరుస్తుంది.

ఇక పచ్చి మామిడికాయను తీసుకోవడం వలన కాలేయ ఆరోగ్యానికి కూడా చాలా సహాయపడుతుంది.వీటిని తరచూ తీసుకోవడం వలన కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం తగ్గిపోతుంది.

ఇక శరీరంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ కూడా ఇది తొలగిస్తుంది.

తాజా వార్తలు