నిద్రించే ముందు ల‌వంగాలు తింటే ఆ జ‌బ్బులు దూరం?

ఘాటైన రుచి, వాస‌న క‌లిగి ఉండే ల‌వంగాలు మసాలా దినుసుల్లో ప్ర‌త్యేక‌మైన స్థానాన్ని సంపాదించుకున్నాయి.

అందుకే మటన్, చికెన్, ఫిష్‌, బిర్యానీ ఇలాంటివి చేసినప్పుడు వాటిలో ఖ‌చ్చితంగా ల‌వంగాలు పాడాల్సిందే.

వంట‌ల‌కు చ‌క్క‌ని రుచిని ఇచ్చే ల‌వంగాల్లో పోష‌కాలు కూడా మెండుగానే ఉంటాయి.విట‌మిన్ ఎ, విట‌మిన్ సి, విట‌మిన్ కె, కాల్షియం, ఫోస్పరాస్, పోటాషియం, సోడియం, మాంగసీస్, ఫైబ‌ర్‌, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్స్ ఇలా ఎన్నో పోష‌కాలు ల‌వంగాల ద్వారా పొందొచ్చు.

అందుకే ల‌వంగాలు ఆరోగ్యానికి మంచివ‌ని నిపుణులు చెబుతుంటారు.ముఖ్యంగా రాత్రి నిద్రించే ముందు ఒక‌టి లేదా రెండు ల‌వంగాలను బాగా న‌మిలి తింటే.

ఎన్నో జ‌బ్బుల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

సాధార‌ణంగా నేటి కాలంలో చాలా మంది మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్య‌తో బాధ ప‌డుతున్నారు.అలాంటి వారు రాత్రి ప‌డుకునే ముందు రెండు ల‌వంగాల‌ను న‌మిలి తినేసి.

ఒక గ్లాస్ గోరు వెచ్చ‌ని నీరు తీసుకోవాలి.ఇలా రెగ్యుల‌ర్‌గా చేస్తే మ‌ల‌బ‌ద్ధ‌కం స‌మ‌స్యే ఉండ‌దు.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు కూడా వేగ‌వంతం అవుతుంది.అలాగే యుక్త వ‌య‌సు రాగానే ప్ర‌ధానంగా వేధించే స‌మ‌స్య మొటిమ‌లు.

అయితే రాత్రి నిద్రించే ముందు ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను తింటే.అందులో ఉండే కొన్ని ప్ర‌త్యేక‌మైన పోష‌కాలు మొటిమ‌ల‌ను రాకుండా అడ్డుకుంటాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

గొంతు నొప్పిని త‌గ్గించ‌డంలోనూ ల‌వంగాలు గ్రేట్‌గా స‌హాయ‌ప‌డ‌తాయి.నిద్రించే ముందు ల‌వంగాలు తిని గోరు వెచ్చ‌ని నీరు తీసుకుంటే.

Advertisement

గొంతు నొప్పి ఇట్టే మటుమాయం అవుతుంది.

అంతేకాదు.ల‌వంగాలు జలుబు, ద‌గ్గు వంటి స‌మ‌స్య‌ల‌ను కూడా త‌రిమి కొట్టి ఇమ్యూనిటీ ప‌వ‌ర్ పెరిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.సో.రాత్రి నిద్ర‌పోయే ముందు ల‌వంగాల‌ను తిన‌డం అల‌వాటు చేసుకోండి.అయితే మంచివి క‌దా అని అతిగా తీసుకోరాదు.

కేవలం ఒక‌టి లేదా రెండు ల‌వంగాల‌ను మాత్ర‌మే తినాలి.

తాజా వార్తలు