రోజు ఉదయం ఒక గ్లాసు వాము నీరు తాగితే ఎన్ని ఆరోగ్య లాభాలో తెలుసా?

వాము( Ajwain ) గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.దాదాపు ప్రతి ఒక్కరి వంట గదిలో వాము ఉంటుంది.

పలు రకాల వంటల్లో వామును విరివిరిగా వాడుతుంటారు.అలాగే ఆరోగ్యానికి వాము ఎంతో మేలు చేస్తుంది.

ముఖ్యంగా రోజు ఉదయం ఒక గ్లాసు వాము నీరు తాగితే అంతులేని లాభాలు మీ సొంతం అవుతాయి.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో వన్ టీ స్పూన్ వాము మరియు ఒక గ్లాస్ వాటర్ పోసి నైట్ అంతా నానబెట్టుకోవాలి.

మరుసటి రోజు నానపెట్టుకున్న వామును ఐదు నుంచి ఆరు నిమిషాల పాటు మరిగించి వాటర్ ను ఫిల్టర్ చేసుకుని గోరువెచ్చగా అయిన తర్వాత సేవించాలి.వాము నీరు ఆరోగ్యానికి వరం అని చెప్పుకోవచ్చు.

Advertisement

నిత్యం ఒక గ్లాసు వాము నీరు తాగడం వల్ల జలుబు, దగ్గు( Cold, cough ), శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, కఫం వంటి సమస్యలు దూరం అవుతాయి.మూత్రపిండాలు, మూత్రాశయంలో రాళ్లు కరుగుతాయి.

అలాగే వాము నీరు శరీరంలో కొలెస్ట్రాల్ మరియు ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.అధిక కొలెస్ట్రాల్ ప్రాణాంతక గుండె జబ్బులకు దారి తీస్తుంది, కాబట్టి దానిని అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం.వాము నీరులో యాంటీ బాక్టీరియల్ మరియు యాంటీ ఫంగల్ గుణాలు ఎక్కువగా ఉన్నందున శరీరంలో బ్యాక్టీరియా మరియు శిలీంధ్రాలతో పోరాడటానికి అద్భుతంగా తోడ్పడతాయి.

రోజు ఉదయం ఒక గ్లాసు వాము నీరు తాగితే గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు దరిచేరకుండా ఉంటాయి.మలబద్ధకం దూరమవుతుంది.బాలింతలు కూడా వాము నీరు తాగవచ్చు.

బాలింతల్లో పాల ఉత్పత్తిని పెంచడానికి వాము నీరు సహకరిస్తుంది.అంతేకాదు రోజూ ఉదయం వాము నీరు తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?
ధనవంతులకు ఆ బ్రిటీష్ యూనివర్సిటీ స్ట్రాంగ్ వార్నింగ్..?

కీళ్ల నొప్పులు వాపులు తగ్గుతాయి.మరియు శరీరంలో అదనపు కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు.

Advertisement

తాజా వార్తలు