వామ్మో.. ప్ర‌తిరోజు క‌రివేపాకు పొడి తింటే ఇన్ని లాభాలు ఉన్నాయా?

క‌రివేపాకు.ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు.

ఎన్నో అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను దూరం చేసే ఈ క‌రివేపాకు కూర‌ల్లో విరి విరిగా ఉపయోగిస్తుంటారు.

కానీ, చాలా మంది కామ‌న్‌గా చేసే పొర‌పాటు.

చ‌క్క‌గా క‌రివేపాకును ఏరి మ‌రీ ప‌క్క‌న పెట్ట‌డం.క‌రివేపాకును తిన‌డం చాలా మందికి ఇష్టం ఉండ‌దు.

ఫ‌లితంగా ఎన్నో ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కోల్పోతారు.అయితే అలా కోల్పోకుండా ఉండాలంటే క‌రివేపాకు పొడి చేసుకుని.

Advertisement

తీసుకోవ‌డం మంచిది.క‌రివేపాకు పొడి తిన్నా.

బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు.భోజ‌నం చేసే స‌మ‌యంలో మొద‌టి రెండు ముద్ద‌ల్లో క‌రివేపాకు పొడి మ‌రియు నెయ్యి క‌లుపుకుని తినాలి.

ఐదు సంవ‌త్స‌రాలు దాటిన వారి ద‌గ్గ‌ర నుంచి ఏ వ‌య‌సు వారైనా ఈ క‌రివేపాకు పొడిని తీసుకోవ‌చ్చు.ఇలా ప్ర‌తి రోజు తిన‌డం వ‌ల్ల శ‌రీరంలో అద‌నంగా పేరుకుపోయి ఉన్న కొవ్వు మ‌రియు కేల‌రీలు క‌రిగిపోతాయి.

ఫ‌లితంగా అధిక బ‌రువు నియంత్ర‌ణ‌లోకి వ‌స్తుంది.అలాగే రెగ్యుల‌ర్‌గా క‌రివేపాకు పొడిని తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు మంట వంటి స‌మ‌స్య‌లు దూరం అవ్వ‌డంతో పాటు.

హెచ్‎సీయూ విద్యార్థి రోహిత్ వేముల కేసు క్లోజ్..!
పాలస్తీనా అనుకూల నిరసనలు : కొలంబియా వర్సిటీలో పోలీస్ అధికారి కాల్పులు .. వివాదం

జీర్ణ వ్య‌వ‌స్థ కూడా చురుగ్గా ప‌ని చేస్తుంది.

Advertisement

మ‌ధుమేహం ఉన్న వారికి కూడా క‌రివేపాకు పొడి బెస్ట్ ఆప్షన్.బ్ల‌డ్ షుగ‌ర్ లెవ‌ల్స్ అదుపు చేసుకునేందుకు చాలా మంది మందులు వాడ‌తారు.కానీ, రెగ్యుల‌ర్‌గా క‌రివేపాకు పొడిని భోజ‌నంలో తీసుకుంటే.

రక్తంలో చ‌క్కెర స్థాయిలు ఎప్పుడు అదుపులో ఉంటాయి.అలాగే ర‌క్త హీన‌త స‌మ‌స్య‌ను దూరం చేయడంలోనూ క‌రివేపాకు పొడి గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

అవును, క‌రివేపాకు పొడిలో ఐరన్, ఫోలిక్ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి.అందువ‌ల్ల‌, ప్ర‌తి రోజు క‌రివేపాకు పొడిని తేనెలో క‌లిపి తీసుకుంటే.

ర‌క్త‌వృద్ధి జ‌రిగి ర‌క్త హీన‌త దూరం అవుతుంది.ఇక క‌రివేపాకు పొడిని రెగ్యుల‌ర్‌గా తీసుకోవ‌డం వ‌ల్ల అందులో ఉండే ప‌లు పోష‌కాలు జుట్టు రాల‌డాన్ని త‌గ్గిస్తాయి.

అదే స‌మ‌యంలో ఒత్తుగా పెరిగేందుకు స‌హాయ‌ప‌డ‌తాయి.

తాజా వార్తలు