రోజుకు పావు గంట మెట్లు ఎక్కి దిగితే.. ఎన్ని బెనిఫిట్సో తెలుసా?

నేటి ఆధునిక కాలంలో అపార్ట్‌మెంట్స్‌, ఆఫీసులు ఇలా ఎక్క‌డ చూసినా లిఫ్ట్‌లే ద‌ర్శ‌న‌మిస్తున్నాయి.దీంతో అంద‌రూ మెట్లు ఎక్క‌డం మానేసి.

లిఫ్ట్‌ల‌నే ఎక్కువ‌గా యూజ్ చేస్తున్నారు.క‌నీసం ఇంట్లో ఉండే మెట్ల‌ను ఎక్క‌డానికి కూడా కొంద‌రు బ‌ద్ద‌కిస్తుంటారు.

కానీ, అతి ఉత్త‌మ‌మైన వ్యాయామాల్లో మెట్లు ఎక్క‌డం ఒక‌టి.రోజుకు క‌నీసం ఒక పావు గంట పాటు మెట్లు ఎక్కి, దిగ‌డం వ‌ల్ల బోలెడ‌న్ని హెల్త్ బెనిఫిట్స్ కూడా పొందొచ్చ‌ని నిపుణులు చెబుతున్నారు.

మ‌రి ఆ ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఏంటో ఆల‌స్యం చేయ‌కుండా చూసేయండి.నిత్యం మెట్లు ఎక్కి, దిగ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యం మెరుగుప‌డుతుంది.

Advertisement

గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ త‌గ్గుతుంది.అలాగే రోజుకు పావు గంట పాలు మెట్లు ఎక్క‌డం, దిగ‌డం చేస్తే.

శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రుగుతుంది.ఫ‌లితంగా వెయిల్ లాస్ అవ్వొచ్చు.

మ‌రో విష‌యం ఏంటంటే.జాగింగ్ ద్వారా కంటే మెట్లు ఎక్క‌డం, దిగ‌డం ద్వారానే ఎక్కువ కేలరీలను క‌రిగించుకోవ‌చ్చు.

కాబ‌ట్టి, అధిక బ‌రువు ఉన్న వారు ఈ వ్యాయామాన్ని ఎంచుకోవ‌డం బెస్ట్ అప్ష‌న్‌.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
అధిక హెయిర్ ఫాల్ తో కలవర పడుతున్న పురుషులకు టాప్ అండ్ బెస్ట్ హోమ్ రెమెడీ ఇదే!

అలాగే రెగ్యుల‌ర్‌గా మెట్లును ఎక్క‌డం, దిగ‌డం వ‌ల్ల ఒత్తిడి, డిప్రెష‌న్‌, మాన‌సిక ఆందోళ‌న వంటి స‌మ‌స్య‌లు దూరం అవుతాయి.నేటి కాలంలో ఎంద‌రినో ప‌ట్టి పీడిస్తున్న నిద్ర లేమి స‌మ‌స్య‌ను దూరం చేయ‌డంలోనూ ఈ వ్యాయామం ఉప‌యోగ‌ప‌డుతుంది.అవును, ప్ర‌తి రోజు పావు గంట పాటు మెట్లు ఎక్క‌డం, దిగ‌డం చేస్తుంటే.

Advertisement

మంచి నిద్ర ప‌డుతుంది.అంతేకాదు, కండ‌రాలు నొప్పులు త‌గ్గి.

దృఢంగా మార‌తాయి.ఇక నిత్యం మెట్లు ఎక్కి, దిగితే.

మ‌ధుమేహం వ‌చ్చే రిస్క్ కూడా త‌గ్గుతుంద‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.కాబ‌ట్టి, మెట్లు ఎక్కడాన్ని అల‌వాటు చేసుకోండి.

ముఖ్యంగా మీ అపార్ట్‌మెంట్స్‌లో, ఆఫీసులో లిఫ్ట్‌ను ఎవైడ్ చేసి మెట్లు ఎక్క‌డానికి ప్ర‌య‌త్నించండి.అదే మీకు ఆరోగ్యం.

తాజా వార్తలు