సాధారణంగా ప్రతి ఒక్కరికి నిద్ర చాలా అవసరం.నిద్ర పోవడం వల్ల మెదడుకు విశ్రాంతి దొరుకుతుంది.
శరీరం రిలాక్స్ అవుతుంది.ఆరోగ్యంగా ఉండాలన్నా, యాక్టీవ్‌గా తిరగాలన్నా నిద్రపోవడం చాలా అవసరం.
కనీసం రోజుకు ఏడు నుంచి ఎనిమిది గంటలు పడుకోకుంటే.అనేక అనారోగ్య సమస్యలు మనల్ని చుట్టుమడతాయి.
కంటినిండా నిద్రపోవడంవల్ల ఒత్తిడి తగ్గి రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
అయితే నేటి కాలంలో చాలా మంది నిద్రలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఈ నిద్రలేమి ఉన్న వ్యక్తులు నిద్రలోకి వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది.ఫలితంగా చిరాకు, ఒత్తిడి లాంటివి ఇబ్బంది పెడతాయి.
వీటితో పాటు నిద్రలేమితో మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బు, గుండె సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ కూడా ఎక్కువు.

అయితే ఇప్పుడు చెప్పుకోబోయే టిప్స్ పాటిస్తే.మంచిగా నిద్ర పట్టడంతో పాటు మనసు కూడా ప్రశాంతంగా ఉంటుంది.అందులో ముందుగా.
రాత్రి భోజనంలో పెరుగు కాకుండా.మజ్జిగ తీసుకోవడం ద్వారా త్వరగా మరియు బాగా నిద్ర పడుతుంది.
ఎందుకంటే.మజ్జిగలో ఉండే ట్రిప్టోఫాన్ నిద్రను ప్రేరేపిస్తుంది.
అలాగే నిద్రించే ముందు ఒక గ్లాస్ పంచదార లేకుండా గోరువెచ్చని పాలు తీసుకుంటే మంచిగా నిద్రపడుతుంది.అదేవిధంగా, ప్రతి రోజు పడుకేనే ముందు ఒక స్పూన్ తేనె తీసుకోవడం వల్ల కూడా నిద్ర బాగా పడుతుంది.
ఇక చాలా మంది కాఫీలు తాగుతుంటారు.కానీ, ఇది నిద్రలేమికి దారితీస్తుంది.
కాబట్టి, కెఫైన్ ఉండే పదార్థాలకు దూరంగా ఉండడండి.