ర‌న్నింగ్ ట్రైన్ ముందు నిల్చుని ఫోజిచ్చాడు.. కానీ ఇంత‌లోనే..

ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియా హ‌వా పెరిగిపోయిన త‌ర్వాత ప్రతి ఒక్క‌రూ కూడా ఫేమ‌స్ అయ్యేందుకు తెగ ప్ర‌య‌త్నిస్తున్నారు.ఈ ప్ర‌య‌త్నాల్లో కొంద‌రు స‌క్సెస్ అయిపోయి ఫేమ‌స్ కావ‌డంతో వారిని చూసి మిగ‌తా వారు కూడా లైకులు, కామెంట్ల కోసం వివ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.

 He Stood In Front Of The Running Train But In The Meantime Running Train, Dan-TeluguStop.com

అయితే ఈ ప్ర‌య‌త్నాలు త‌మ ప్ర‌తిభ‌ను నిరూపించుకునే విధంగా ఉంటే ప‌ర్వాలేదు గానీ అన‌వ‌స‌ర ప్ర‌యోగాల‌కు పోయి కొన్ని సార్లు ప్ర‌మాదాల బారిన ప‌డుతున్నారు.ఇంకొన్ని సార్లు ప్రాణాలు కూడా పోగొట్టుకుంటున్నారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు అత్యంత విషాదాంతాన్ని నింపుతున్నాయి.

ఇప్పుడు కూడా ఓ వ్య‌క్తి ఇలాగే చేసి చివ‌ర‌కు ప్రాణాలు పోగొట్టుకున్నాడు.

చాలామంది క‌దిలే ట్రైన్ ముందు నిల‌బ‌డి సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్న క్ర‌మంలో ట్రైన్ ఢీకొట్టి మ‌ర‌ణించిన వార్త‌లు వింటూనే ఉన్నాం.అయితే ఈ వ్య‌క్తి కూడా ఇలాగే చేయ‌బోయి చివ‌ర‌కు ప్రాణాలు తీసుకున్నాడు.

ఇలాంటి వార్త‌లు విన్న‌ప్పుడు అయినా అత‌ను ఒక క్ష‌ణం ఆలోచిస్తే ఈ ప‌రిస్థితి రాక‌పోయేది.ప్ర‌స్తుతం ఈ వీడియో నెట్టింట విప‌రీతంగా వైర‌ల్ అవుతోంది.మధ్యప్రదేశ్​ హోశంగాబాద్​లో జ‌రిగిన ఈ వీడియోలో ఓ వ్య‌క్తి స్పీడుగా వ‌స్తున్న ట్రైన్ ముందు నిల‌బ‌డి ఉంటాడు.

అయితే వెన‌కాల నుంచి ఇటార్సీ-నాగ్​పుర్​ ప‌ట్టాల న‌డుమ ట్రైన్ జెట్ స్పీడుగా వ‌స్తోంది.ఇక ట్రైన్ ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్నా ప‌ట్టించు కోకుండా త‌న ముందు ఉన్న స్నేహితుడిని వీడియో తీయమని చెబుతుంటాడు.కానీ ఇంత‌లోనే రైలు వేగంగా వ‌చ్చి అత‌న్ని ఢీ కొడుతుంది.

ఇక్క‌డ విష‌యం ఏంటంటే వీడియో తీస్తున్న వ్య‌క్తి కూడా అత‌న్ని అలెర్ట్ చేయ‌లేదు.దీంతో రైలు ఢీ కొని అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు విడిచాడు.

ట్రైన్ డ్రైవర్ హారన్ కొడుతున్నా ఆ వ్య‌క్తి మాత్రం వినిపించుకోలేదు.ఇదే అత‌ని ప్రాణాలు తీసేసింది.

ఇక ఈ వీడియోను చూసిన వారంతా ఇలాంటి పిచ్చి ప‌నులు అవ‌స‌రమా అంటూ కామెంట్లు పెడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube