అగ్ర రాజ్యం అమెరికా సుదీర్ఘకాలం తరువాత తమ దేశంలోకి వచ్చే వారికి ఆహ్వానం పలికింది.కరోనా నిభందనల నేపధ్యంలో ఇన్నాళ్ళు దాదాపు 18 నెలలుగా 33 దేశాలపై ఆంక్షలు విధించిన అమెరికా ఇప్పుడు వచ్చేయండి అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.
రెండు డోసులు వేయించుకున్న వారు నవంబర్ నుంచీ అమెరికా రావచ్చని ప్రకటించింది.ఈ నేపధ్యంలోనే అమెరికా సిడిసి (సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్) ఓ ప్రకటన విడుదల చేసింది.
కానీ అమెరికాకు ఎలాంటి వారు రావాలి, ఎలాంటి నిభందనలు పాటించాలి అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.ప్రస్తుత పరిస్థితులలో అమెరికా ఎలాంటి వారు వెళ్ళాలి.
33 దేశాలకు అమెరికా వచ్చేందుకు అనుమతులు లభించాయి అయితే ఈ దేశాలకు చెందిన వారు తప్పకుండా రెండు డోసుల వ్యాక్సిన్ చేసుకున్నవారు మాత్రమే వెళ్లేందుకు అర్హులు.అంతేకాదు రెండు డోసులు తీసుకున్న వారు కూడా అమెరికా వెళ్ళే మూడు రోజుల లోపు కరోనా పరీక్షలు చేయించుకుని నెగిటివ్ రిపోర్ట్ వచ్చి ఉండాలి.
కేవలం టీకాలు తీసుకున్న వారు మాత్రమే అమెరికా వెళ్లేందుకు అర్హులు.ఇక ఎలాంటి వ్యాక్సిన్ తీసుకున్న వారు అమెరికా వెళ్లేందుకు అర్హులు అనే విషయంపై అమెరికా సిడిసి తాజాగా నివేదికను సిద్దం చేస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఎఫ్డీఏ ఆమోదం పొందిన వ్యాక్సిన్ లు తీసుకున్నవారికి అనుమతులు లభిస్తాయని సిడీసి అధికారులు అంటున్నారు.ఆ లెక్కలో మనదేశంలో కోవాక్సిన్ కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతులు లేవు మరి అలాంటప్పుడు కోవాక్సిన్ తీసుకున్నవారిని అనుమతించాలా లేదా అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఇదిలాఉంటే టీకాలు తీసుకోకుండా తమ దేశంలోకి వచ్చే విదేశీయులలో కొందరిపై మానవతా దృక్పథంతో అనుమతులు ఇచ్చే అవకాశం ఉంటుందని అది కూడా అందరికి కాకుండా ప్రత్యేకమైన పరిస్థితులలో అనుమతులు ఉంటాయని ఈ విషయంపై కూడా ప్రభుత్వం త్వరలో ఓ నిర్ణయానికి వస్తుందని అంటున్నారు పరిశీలకులు.ఏది ఏమైనా ఇప్పటికైనా అమెరికా ఆంక్షలు సడలిస్తూ అమెరికా వెళ్లేందుకు అనుమతులు ఇచ్చిందని కానీ ఎలాంటి షరతులతో ప్రవేశాలకు అనుమతులు ఇస్తారోనని ఆందోళన చెందుతున్నారు వలస వాసులు.