తిక్క కుదిరింది.. 20 రూపాయల కోసం రూ.6,020 జరిమానా కట్టాడు!

మీరు విన్నది నిజమే.ఓ బలిసిన వ్యాపారి 20 రూపాయల కోసం కక్కుర్తిపడి ఏకంగా రూ.6,020 జరిమానా కట్టాడు.ఈ ఘటన మైసూరులో జరగగా తాజాగా వెలుగు చూసింది.

 He Paid A Fine Of Rs. 6,020 For 20 Rupees,viral Latest, News Viral, Social Medi-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.మైసూరులో రిటైర్డు టీచర్‌ సత్యనారాయణ 2019లో ఓ షాపులో 3 శారీ ఫాల్స్‌ను కొనుగోలు చేశాడు.అవి ఒక్కొక్కటి రూ.30 కాగా మొత్తం రూ.90 ఆ వ్యాపారి తీసుకోవాలి కదా.కానీ అతగాడు మాత్రం రూ.110 వసూలు చేశాడు.ఎందుకు ఎక్కువ తీసుకున్నావని టీచర్ ప్రశ్నించగా ఆ వ్యాపారి చాలా అసభ్యకర పదజాలంతో దూషించాడు.

దీంతో టీచర్ సత్యనారాయణ వ్యాపారిపై కేసు వేసి రూ.61వేల పరిహారాన్ని ఇప్పించాలని కోరాడు.మూడేళ్లపాటు జరిగిన విచారణలో వ్యాపారి చేసింది తప్పని తేలడంతో కోర్టు ఆ వ్యాపారికి రూ.6,020 జరిమానా విధించింది.విషయం తెలిసిన స్థానికులు వ్యాపారికి తిక్క కుదిరిందని సంబర పడుతున్నారు.20 రూపాయిల కోసం మూడేళ్ళ పాటు ఈ రాద్ధాంతం ఎందుకు అని టీచర్ ని ప్రశ్నించగా… “20 రూపాయిలు అనేది సమస్య కానేకాదు.ఆ వ్యాపారి చేస్తున్న అక్రమాలను అరికట్టి, బుద్ధి చెబుదామనే ఇలా మూడేళ్లపాటు పోరాడాను!” అని చెప్పుకొచ్చాడు.

Telugu Rupees, Fine, Fine Rs, Mysore, Latest-Latest News - Telugu

సరిగ్గా ఇలాంటి సంఘటనే ఆ మధ్య రాజస్తాన్‌లో జరిగింది.సుజీత్‌ స్వామి అనే ఇంజనీర్‌ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను సుమారు ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఈ క్రమంలో ఈయన చేసిన పోరాటం దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికి లబ్ధి చేకూరేలా చేసింది.2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్లో స్వామి టికెట్‌ బుక్‌ చేసుకున్నాడు.తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు.క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్‌ చార్జిని కూడా టికెట్‌ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది.ఈ విషయమై స్వామి వేసిన కేసు ఫలించి మంచి ఫలితం వచ్చింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube