అతడు ఆర్డర్ చేసింది ఐస్‌క్రీం, చిప్స్‌... కానీ డెలీవరీ అయ్యింది మాత్రం!

ప్రస్తుత టెక్నాలిజీ ప్రపంచంలో మనిషి ఏది కావాలన్నా తన కాళ్ళదగ్గరికే తెచ్చుకుంటున్నాడు.కట్టుకునే బట్టనుండి తినే తిండివరకు ఇలా ప్రతిదీ కూడా ఇంటికే వచ్చేస్తోంది.

 He Ordered Ice Cream, Chips But It Was Delivered, Ice Cream, Chips, Online Order-TeluguStop.com

ఫుడ్‌ నుంచి గ్రాసరీస్‌, మెడిసిన్‌, ఎలక్ట్రానిక్స్‌, హోం నీడ్స్‌ ఇలా ప్రతిదీ.ఫోన్‌లో ఆర్డర్‌ చేస్తే క్షణాల్లో మన ముందు వాలిపోతుంది.

ఈ క్రమంలోనే కొన్ని పొరపాట్లు కూడా దొర్లుతున్నాయి.అప్పుడు ఆర్డర్‌లు ఆలస్యం అవ్వడం, క్యాన్సిల్‌ అవ్వడం లేదా మనం చెప్పిన వస్తువుకు బదులు వేరే వస్తువు డెలివరీ అవ్వడం లాంటివి సాధారణంగా జరుగుతుంటాయి.

తాజాగా ఓ వ్యక్తికి కూడా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

వివరాల్లోకి వెళితే, తమిళనాడు రాష్ట్రంలోని కోయంబత్తూరు జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఒక ప్రైవేట్ ఇంగ్లీష్ న్యూస్ మీడియాలో ఫోటోగ్రాఫర్‌గా వర్క్ చేస్తున్నాడు.

గడిచిన శనివారంనాడు రాత్రి ఆన్‌లైన్‌ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ నుంచి తన పిల్లల కోసం ఐస్ క్రీమ్, చిప్స్ ఆన్లైన్లో ఆర్డర్ చేశాడు.తీరా ఆర్డర్‌ డెలివరీ అయ్యాక.

పార్శిల్‌ ఓపెన్‌ చేసి అందులో ఉన్న వస్తువును చూసి గుండ్లు మిటకరించాడు.విషయం ఏంట్రా అంటే, ఐస్‌క్రీం, చిప్స్‌కు బదులు అతగాడికి కండోమ్‌లు డెలివరీ అయ్యాయి.

ఇది చూసి షాక్ తిన్న అతను దానిని ఫోటో తీసి తన ట్విటర్‌ అకౌంట్‌లో జాగ్రత్తగా పోస్ట్ చేశాడు.

అయితే, ఆ పోస్ట్ గమనించిన స్విగ్గీ సంస్థ జరిగిన పొరపాటుపై వివరణ ఇచ్చింది.

తప్పుడు వస్తువు డెలివరీ చేసినందుకు సదరు వ్యక్తికి క్షమాపణలు చెప్పి, డబ్బును తిరిగి ఇచ్చింది.ఇకపోతే అతగాడి పోస్ట్ ని చూసిన నెటిజన్లు మాత్రం సదరు డెలివరీ సంస్థపైన అసహనం వ్యక్తం చేస్తున్నారు.

ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి కండోమ్ ఎలా వచ్చిందని ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube