పోసాని వెనక ఉన్నది అతనేనట.. అచ్చెన్న జోస్యం

జనసేనాని పవన్ కల్యాణ్ వ్యాఖ్యలతో ఏపీలో రాజకీయ దుమారం రేగిన సంగతి అందరికీ తెలిసిందే.

ఈ క్రమంలోనే ఆన్‌లైన్ టికెటింగ్ విధానాన్ని వ్యతిరేకిస్తూ పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలకుగాను ఏపీ మంత్రులు కౌంటర్స్ ఇస్తున్నారు.

సినీ నటుడు, వైసీపీ మద్దతుదారు పోసాని కృష్ణమురళి సైతం పవన్ కల్యాణ్‌ను విమర్శించారు.ఈ నేపథ్యంలోనే పోసాని వ్యాఖ్యలపై టీడీపీ ఏపీ చీఫ్ కింజెరపు అచ్చెన్నాయుడు స్పందించారు.

పోసాని పెయిడ్ ఆర్టిస్ట్ అని విమర్శించారు.పోనాని మాట్లాడిన బూతులు సభ్యసమాజం తలదించుకునేలా ఉన్నాయని ఫైర్ అయ్యారు.

తాగుబోతులు కూడా పోసానిలా మాట్లాడరేమోనని అన్నారు.జనసేన చీఫ్ పవన్ కల్యాణ్, ఆయన కుటుంబ సభ్యులను పోసాని చేత దూషించడం వెనుక పీకే టీం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు.

Advertisement

పీకే డైరెక్షన్‌లో వైసీపీ నేతలు, పోసాని మాట్లాడుతున్నారని, సామాన్యులు వినలేని భాషలో జుగుప్సాకరమైన భాషను మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇకపోతే వైసీపీ నేతలు ఇటువంటి భాష మాట్లాడుతుంటే వైసీపీ అధినేత జగన్ కంట్రోల్ చేయాల్సింది పోయి ఆనందపడుతున్నారని ఆరోపించారు.

వైసీపీ ప్రభుత్వం ప్రజలను దోచుకునేందుకు సిద్ధమైందని, ప్రజల్లో వైసీపీపై తీవ్రమైన వ్యతిరేకత ఉందని చెప్పారు.

ధరలు పెంచి, దోపిడీలు చేయడం వైసీపీ సర్కారకు అలవాటేనని, వైసీపీ నేతలు కుల, మత ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.వైసీపీ నేతలకు ప్రజలే గుణపాఠం చెప్తారని, ఏపీ డ్రగ్స్ మాఫియాకు అడ్డాగా మారిందని ఆరోపించారు.ఈ క్రమంలోనే ఏపీలో డ్రగ్స్ మాఫియా పెట్రేగిపోతున్నదని, రూ.2 లక్షల కోట్ల డ్రగ్స్ మాఫియాకు ఏపీ అడ్డాగా మారిందని అచ్చెన్న ఆరోపించారు.ఇకపోతే పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపైన ఇప్పటికే వైసీపీ మంత్రులు స్పందించారు.

ఆన్‌లైన్ టికెటింగ్ విధానంపై మంత్రి పేర్ని నాని సినీ పెద్దలతో సమావేశమయ్యారు.ఈ విషయమై సమగ్ర చర్చ జరిపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది.

ఆ రెండేళ్ల షరతు త్రిష జీవితాన్ని మార్చేసిందట.. త్రిషకు ప్లస్ అయిన ఆ కండీషన్ ఏంటంటే?
Advertisement

తాజా వార్తలు