ఆయనే సీఎం : మళ్లీ మళ్లీ కేటీఆర్ జపం చేస్తున్న మంత్రులు !

కాబోయే తెలంగాణ సీఎం కేటీఆర్ ! కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యే రోజు తొందర్లోనే ఉంది.అంటూ రకరకాల కామెంట్స్ గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకుల నుంచి వినిపిస్తూనే ఉంది.

 He Is The Cm  Ministers Chanting Ktr Again And Again, Telangana Cm , Kcr, Telang-TeluguStop.com

  రెండోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కేటీఆర్ సీఎం అనే నినాదం సర్వ సాధారణంగా మారిపోయింది.దీనికి తగ్గట్లుగానే కేసీఆర్ , కేటీఆర్ వ్యవహార శైలి ఉండేది.

దీనికి తగ్గట్లుగానే బిఆర్ఎస్ పేరుతో జాతీయ పార్టీని కేసీఆర్ స్థాపించడం, జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పేందుకు ప్రయత్నించడం , పూర్తిగా బీఆర్ఎస్ విస్తరణ పనుల్లో కేసీఆర్ బిజీ బిజీ గా గడుపుతూ ఉండడంతో,  మళ్లీ ఇప్పుడు కేటీఆర్ సీఎం అనే నినాదం మరోసారి తెరపైకి వచ్చింది.కాబోయే సీఎం కేటిఆర్ అంటూ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటన చేయగా, తాజాగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశారు.

Telugu Ktr Cm, Telangana Cm, Telangana-Politics

తెలంగాణకు కాబోయే సీఎం కేటీఆర్ అని, రాష్ట్రానికి సమర్థవంతమైన నాయకుడు కేటీఆర్ అని ఎర్రబెల్లి అన్నారు.కేటీఆర్ హయంలో పెద్దపెద్ద పరిశ్రమలు తెలంగాణకు వస్తున్నాయని,  దేశంలో ఎక్కడా లేనివిధంగా ఉపాధి అవకాశాలు తెలంగాణలో లభిస్తున్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.కేటీఆర్ మా నాయకుడు కావడం మా అదృష్టంగా భావిస్తున్నామంటూ మంత్రి వ్యాఖ్యానించారు.ఒకవైపు ఎన్నికల సమయం దగ్గర పడుతున్న సమయంలో,  కేటీఆర్ పై వరుసగా మంత్రులు ఈ రకమైన వ్యాఖ్యలు చేస్తూ ఉండడం తో,  ఇదంతా వ్యూహాత్మకంగా చేయిస్తున్నారా లేక మంత్రులే తమ అభిమానాన్ని ఈ విధంగా  ప్రదర్శిస్తున్నారా అనే అనుమానాలు ఎన్నో కలుగుతున్నాయి.

అయితే సొంత పార్టీ నాయకులు , మంత్రులు ఈ రకమైన కామెంట్ చేస్తున్నా.అటు కేసీఆర్ కానీ,  ఇటు కేటీఆర్ కానీ స్పందించకపోవడం తో మరిన్ని అనుమానాలు కలుగుతున్నాయి.

Telugu Ktr Cm, Telangana Cm, Telangana-Politics

ఇక చాలా రోజులుగా తెలంగాణలో ముందస్తు ఎన్నికలు జరుగుతాయి అనే ప్రచారం జరుగుతోంది.వాస్తవంగా ఈ నవంబర్ లేదా  డిసెంబర్ లోనే తెలంగాణా అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది.ఇప్పుడు హడావుడిగా అసెంబ్లీ ని కేసీఆర్ రద్దు చేసినా.అది ముందస్తు ఎన్నికల లెక్కల్లో కి రాదు.అసలు ముందస్తు ఎన్నికల విషయంలో కేసీఆర్ ఏ ఆలోచనతో ఉన్నారు అనేది క్లారిటీ లేదు.దేశ రాజకీయాల్లో యాక్టిివ్ అయ్యి పూర్తిగా అక్కడే దృష్టిపెట్టే ఆలోచనతో ఉంటే.

కేటీఆర్ కు ముఖ్యమంత్రిగా బాధ్యతలు అప్పగించే అవకాశం లేకపోలేదు.మరి ఈ విషయంలో కేసీఆర్ ఆలోచన ఏ విధంగా ఉందో .?

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube